Movie News

సొంత బుక్ ఎప్పుడు రాస్తున్నావ్ పవన్?

పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాల ప్రియుడు. ప్రతీసారి ఓ కొత్త పుస్తకం గురించి చెబుతూ అభిమానులకు షాక్ ఇస్తుంటాడు పవన్. తాజాగా ‘ఖారవేలుడు’ అనే పుస్తకం, తనలో తొలిసారి రాజకీయాల గురించి ఆలోచన కలిగేలా చేసిందంటూ ట్విట్టర్ ద్వారా వివరించాడు పవన్. ‘మొదటిసారి డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమా ఫెయిల్యూర్‌తో మానసికంగా కృంగిపోయిన సమయంలో నాగబాబు ఈ పుస్తకం నాకు ఇచ్చాడు…’ అంటూ ఓ పాత పుస్తకాన్ని కొత్తగా పరిచయం చేశాడు జనసేనాని.

ఖాళీ సమయం కనిపిస్తే చాలు, నిత్యం ఏదో పుస్తకం చదువుతూ కనిపించే పవన్ కళ్యాణ్… సొంత పుస్తకం ఎప్పుడూ రాస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓ నిత్య అన్వేషిగా, జనాల కోసం ఏదో చేయాలని పరితపించే ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్‌కు తెలుగురాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ ఉంది.

బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసే పవర్ స్టార్ సొంతంగా పుస్తకాన్ని రచిస్తే అది సాహితీలోకంలో ఓ సెన్సేషన్ అవుతుంది. రాజకీయాల్లో ఇంకా సక్సెస్ కాకపోయినా, తన స్పీచ్‌లతో కార్యకర్తలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పదునైన ఆలోచనలకు అక్షర రూపం కల్పిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక.

మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఓ అర్థంకాని ఫజిల్ లాంటిదే. ఆవేశం, ఆలోచన కలగలిసిన పవన్ కళ్యాణ్ తన జీవిత చరిత్రను స్వయంగా రచిస్తే… అది సంచలనం క్రియేట్ చేయడం పక్కా.

ఎన్నో ఎత్తుపల్లాలున్న పవన్ జీవితం పుసక్తరూపంలో వస్తే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికనట్టే. మరి తనలోని సాహిత్య కోణాన్ని బయటికి తీసి పవన్ కళ్యాణ్ పేపర్‌పై ఎప్పుడు పెడతాడో చూడాలి.

This post was last modified on April 24, 2020 4:24 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

41 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago