థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయనే దానిపై క్లారిటీ లేదు కానీ… సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా అంతా నార్మల్ అయిపోతుందని నమ్మకంగా ఉన్నారు. అందుకే అప్పటికి సినిమా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు చిత్ర సీమ నుంచి పెద్ద సినిమాలేమీ విడుదలకు సిద్ధంగా లేవు. కనుక సంక్రాంతికి రివాజుగా వచ్చే పెద్ద సినిమాలు ఈసారి వచ్చే వీల్లేదు.
దీనిని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు సంక్రాంతి రిలీజ్ కి సిద్ధపడుతున్నాయి. అయితే మన సినిమాలకు పూర్తి అడ్వాంటేజ్ లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చేసాయి. కన్నడ సినిమా కేజీఎఫ్ 2 సంక్రాంతి రిలీజ్ పై కన్నేసింది.
అలాగే విజయ్ మాస్టర్ కూడా సంక్రాంతి స్లాట్ ఖాయం చేసుకుంది. ఈ రెండు సినిమాలకు తెలుగు మార్కెట్ లో, ఆడియన్స్ లో చాలా క్రేజ్ ఉంది. కాబట్టి వీటికి ఎక్కువ సంఖ్యలోనే థియేటర్లు కేటాయిస్తారు కనుక సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండదని ఆశ పడుతోన్న సినీ నిర్మాతలకు ఇది చేదు వార్తే!
This post was last modified on August 5, 2020 8:47 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…