ఈ మధ్య కాలంలో ట్రైలర్‌తోనే తీవ్ర వివాదం రేపిన సినిమా అంటే.. ది కేరళ స్టోరీనే. కేరళలో హిందూ, క్రిస్టియన్, ఇతర మతాల అమ్మాయిలను లవ్ జిహాదీ పేరుతో ఇస్లాంలోకి మార్చి వారిని గల్ఫ్ దేశాల్లో అమ్మేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. ఇలాంటి అంశాల చుట్టూ తీవ్ర వివాదాస్పద కథతో తెరకెక్కిన చిత్రమిది.
ఇలాంటి కాంట్రవర్శల్ సినిమాలు థియేటర్లలో రిలీజవడమే కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ ముస్లింలను విలన్లుగా చూపించే ఈ తరహా సినిమాలకు నరేంద్ర మోడీ సర్కారు రాచబాట పరుస్తున్న మాటను ఎవ్వరూ ఖండించలేరు. గత ఏడాది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఇలాగే మద్దతు సంపాదించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇప్పుడు కేరళ స్టోరీ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.
కొవిడ్ తర్వాత హిందీలో మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఐదారు కోట్ల డేవ-1 వసూళ్లకు పరిమితం అవుతున్నాయి. కానీ కేరళ స్టోరీ తొలి రోజు రూ.8 కోట్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. రెండో రోజు వసూళ్లు ఇంకా పెరగడం విశేషం. శనివారం ఈ చిత్రానికి రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇండియాలో.
మేజర్ సిటీస్‌లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. కాగా ఈ సినిమాకు అక్కడక్కడా నిషేధాజ్ఞలు తప్పట్లేదు. తమిళనాడులో మల్టీప్లెక్సులన్నింట్లో ఈ సినిమా షోలు ఆపేశారు ఆదివారం. కేరళలో కూడా చాలా మల్టీప్లెక్సుల్లో సినిమాను ఆడించట్లేదు. అక్కడి ప్రభుత్వమే సినిమాకు వ్యతిరేకంగా ఉంది. భాజపా ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇబ్బందులు తప్పట్లేదు. అయినా సినిమా అందుబాటులో ఉన్న చోట మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి.
This post was last modified on May 8, 2023 9:13 pm
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…