Movie News

కేరళ స్టోరీ కాపీ కొట్టి తీశారా

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ది కేరళ స్టోరీ నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా ఆడియన్స్ వాళ్లంత వాళ్లే థియేటర్లకు వస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కి చేసిన పబ్లిసిటీలో దీనికి సగం కూడా జరగలేదు. అయినా జనం వెళ్తున్నారు. హైదరాబాద్ లో శని ఆదివారాలు కొత్త రిలీజులు రామబాణం, ఉగ్రం కంటే దీనికే ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. సెన్సార్ ఆలస్యం కావడం వల్ల తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేదు కానీ లేదంటే వసూళ్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండేవని ట్రేడ్ అభిప్రాయ పడుతోంది. కంటెంట్ అంత షాకింగ్ గా ఉంది మరి.

కలెక్షన్ల సంగతి అలా ఉంచితే అసలు ది కేరళ స్టోరీ ఒరిజినల్ కాదనే దానికి ఆధారాలు దొరికాయి. నెట్ ఫ్లిక్స్ లో 2020 సంవత్సరంలో కాలిఫెట్ అనే స్వీడిష్ వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో సుమారు ఏడు గంటల నిడివితో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూ జరుగుతుంది. ఐసిస్ తీవ్రవాదుల ఉచ్చులో పడి ప్రమాదంలో నెట్టబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బ్యాక్ డ్రాప్ యూరోప్ లో ఉంటే మనది కేరళ నుంచి సిరియా అన్నట్టుగా చూపించారు. పోలికలు చాలా ఉన్నాయి.

అసలు దీన్ని చూడకుండా దర్శకుడు సుదిప్తో సేన్ కేరళ స్టోరీని తీశారంటే నమ్మలేనంత సారూప్యతలు ఉన్నాయి. ఇండియాలోనూ ఈ కాలిఫెట్ ని చూడొచ్చు ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. కేరళ తమిళనాడు మల్టీప్లెక్సుల్లో ఇప్పటికీ దీన్ని బ్యాన్ చేశారు.శాంతి భద్రతల సమస్యతో పాటు సరైన స్పందన లేదన్న కారణంగా ప్రదర్శనలు ఆపేశామని సదరు సంఘం పేర్కొంటోంది. లక్కీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకపోవడం విశేషం. సోమవారం బయటికి వచ్చే వసూళ్ల ఫిగర్లు మతిపోయేలా ఉంటాయని బయ్యర్స్ టాక్

This post was last modified on May 7, 2023 9:10 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

30 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

59 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

1 hour ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

3 hours ago