Movie News

హీరోలు దీనికి బాధ్యత వహించాలా?

యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ తీరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘ఖుషి’ పోస్టర్లో తన పేరు ముందు ‘The’ అని పెట్టుకోవడాన్ని తప్పుబడుతూ అనసూయ చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది.

విజయ్ అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. బూతులు తిట్టారు. విజయ్‌ని అనసూయ టార్గెట్ చేయడం ఇది తొలిసారి కాదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అతను పలికిన బూతు మాటల విషయంలో అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిందామె. అప్పుడు కూడా చాలామంది నెటిజన్లతో ఆమెకు వాదోపవాదాలు జరిగాయి.

ఇప్పుడు మరోసారి పనిగట్టుకుని విజయ్‌ని టార్గెట్ చేసిందంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు తగ్గి లైమ్ లైట్లో లేకుండా పోయిన అనసూయ.. అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తోందన్నది విజయ్ అభిమానులతో పాటు కొందరు నెటిజన్ల ఆరోపణ.

అనసూయ ఉద్దేశం ఏంటన్నది పక్కన పెడితే.. ఇలాంటి వివాదాలు వచ్చినపుడు హీరోలను బాధ్యులుగా చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. గతంలో కత్తి మహేష్ అనే క్రిటిక్‌కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. కత్తి మహేష్ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను ఏదో అనడం.. ఆయన్ని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం.. చివరికి కత్తి మహేష్ పవన్‌నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. తన అభిమానులను పవన్ అదుపులో పెట్టుకోవట్లేదని.. వాళ్లను మందలించట్లేదని మహేష్ ఆరోపించాడు.

తర్వాత ఓ సందర్భంలో పవన్ అభిమానులు తనను తిట్టారంటూ.. పవన్‌ను పట్టుకుని పోసాని కృష్ణమురళి దారుణమైన బూతులు తిడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు విజయ్ అభిమానుల తీరుతో అనసూయ.. అతణ్ని టార్గెట్ చేస్తోంది. ఐతే విజయ్ తన పేరు ముందు ‘The’ అని పెట్టుకోవడం అతడి వ్యక్తిగత విషయం.. మరి మిగతా హీరోలు తమకు తాముగా పేర్ల ముందు రకరకాల బిరుదులు పెట్టుకున్నారు.. మరి అవేవీ అభ్యంతరకరం కాదా.. వాళ్లందరినీ తప్పుబట్టగలదా అన్న ప్రశ్నలు విజయ్ అభిమానుల నుంచి ఎదురవుతున్నాయి.

ఇండస్ట్రీలో ఉంటూ ఒక హీరోను అదే పనిగా టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వారంటున్నారు. ఇలా కోరి వివాదాలు తెచ్చుకుని.. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు తిట్టిన తిట్లను స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం.. పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్లడం.. దీనికంతటికీ హీరోదే బాధ్యత అనడం సమంజసమేనా అన్న చర్చ నడుస్తోంది. హీరోలు అభిమానులను నియంత్రించగలరా.. ఒకవేళ వాళ్లు ఊరుకోమని చెప్పినా.. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని ఫ్యాన్స్ వింటారా అన్నది కూడా ఆలోచించాల్సిందే.

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

8 seconds ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

8 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

58 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago