టాలీవుడ్లో పెద్ద పెద్ద ఫ్యామిలీల నుంచి వారసులు టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కానీ వాళ్లెవ్వరి మీదా పెట్టనంత పెట్టుబడి తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ మీద పెట్టాడు బెల్లంకొండ సురేష్. మొదట్లో తనే సొంతంగా సినిమాలు నిర్మించాడు. ఆ తర్వాత వేరే నిర్మాతల్ని ముందు పెట్టి వెనుక నుంచి అన్నీ సెట్ చేశాడు. కొడుకును హీరోగా పటె్టి వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్ లాంటి స్టార్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్లలో సినిమాలు చేయించాడు సురేష్. ఈ వరస చూసి వాళ్ల దగ్గర ఎంత డబ్బు మూలుగుతోందో అని చాలామంది ఆశ్చర్యపోయారు.
అలాంటిది తమకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన తొలి సినిమా ‘అల్లుడు శీను’ హిట్టయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో తాను ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉన్నట్లు అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
‘‘నా తండ్రి వల్లే నేను సినిమాల్లోకి సులభంగా రాగలిగానని అందరూ అంటూ ఉంటారు. అది నిజమే. నా తొలి చిత్రం ‘అల్లుడు శీను’కు ఆయన ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారు. కానీ ఆయన మద్దతుతో పాటు నా కష్టం తోడవడం వల్లే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. అందరూ సమంత, తమన్నా లాంటి వాళ్లు నాతో కలిసి ఎలా నటించారు అనుకుంటూ ఉంటారు.
కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందే నేను సమంత, తమన్నాలకు నేను నా డ్యాన్స్, డైలాగ్ డెలివరీ స్కిల్స్ తెలిసేలా ఒక డెమో వీడియో చేసి పంపించాను. అందులో నా టాలెంట్, హార్డ్ వర్క్ చూశాకే వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా హిట్టయింది. అదే సమయంలో నాన్న ఓ సినిమా నిర్మించారు. కానీ అది నిరాశ పరిచింది. అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫెయిలయ్యాయి. దీంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. నాపై ఒత్తిడి పెరిగింది. అవకాశాలు వచ్చినా సినిమాలు చేయలేదు. ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉన్నా. తక్కువ బడ్జెడ్లో రెండో సినిమా చేశా. బోయపాటి శ్రీను గారు తీసిన ‘జయ జానకి నాయక’తో అన్ని రకాలుగా నిలదొక్కుకున్నా’’ అని శ్రీనివాస్ వెల్లడించాడు.
This post was last modified on May 7, 2023 7:00 am
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…