దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్ వాస్తవానికి ఈ మేలోనే విడుదల కావాలి. ఆ మేరకు ఇంతకు ముందే ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడంతో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఆలస్యం జరగడంతో వాయిదా వేయక తప్పలేదు. సరైన సమయంలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని నిన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి దీని మీద చిన్న టీజర్, ఒక లిరికల్ వీడియోతోనే మంచి బజ్ వచ్చింది. నార్త్ వైపు నుంచి ట్రేడ్ పరంగా పెద్ద ఆఫర్లే వచ్చాయి. అయినా ఎందుకు ఆగారనే దానికి ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఆది పురుష్ మీద సమాన స్థాయిలో అంచనాలు అనుమానాలు రెండూ ఉన్నాయి. కొంత క్లారిటీ మే 9న వచ్చే ట్రైలర్ తో ఇచ్చేస్తారు కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న గాథ. ఎలాంటి కల్పితాలు ఉండవు. దాదాపు ఉన్నదున్నట్టుగానే తెరకెక్కించారు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ప్రమోషన్లను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రేంజ్ లో విడుదల ప్లాన్ చేసుకుంది. ది కేరళ స్టోరీని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు. అలాంటిది అయోధ్య ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆది పురుష్ ని ఇంకో స్థాయిలో పొగుడుతారు
ఇలా ఇంకో రెండు మూడు వారాల్లో ఆది పురుష్ హంగామా పీక్స్ కు వెళ్లిపోతుంది. ఈ సందడిలో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హనుమాన్ గురించి ఏం చెప్పినా జనానికి రిజిస్టర్ అవ్వదు. పైగా హీరో తేజ సజ్జకు తెలుగులోనే కాస్త ఇమేజ్ ఉంది. బయట గుర్తుపట్టరు. అలాంటప్పుడు పబ్లిసిటీ పాత్ర చాలా కీలకం. అందరూ రాముడి మీదే దృష్టి పెట్టినప్పుడు హనుమంతుడిని పట్టించుకోవడం తక్కువ. అందుకే జూలైలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈలోగా అది పురుష్ కు పబ్లిక్ లో వచ్చిన స్పందన, కలెక్షన్లు అయోధ్య సెంటిమెంట్ ఇవన్నీ హనుమాన్ కు ఉపయోగపడతాయి.
This post was last modified on May 7, 2023 6:58 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…