Movie News

చిరు చాలా క‌మ‌ర్షియ‌ల‌బ్బా..

ఇండియాలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన ఘ‌న‌త‌ మెగాస్టార్ చిరంజీవికి ఉంది. కెరీర్లో ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేసిన‌ప్ప‌టికీ.. ఒక‌ప్పుడు ఆయ‌న రుద్ర‌వీణ‌, స్వ‌యంకృషి, ఆప‌ద్భావంధ‌వుడు లాంటి క‌థా బ‌లం ఉన్న, త‌న న‌ట‌నా కౌశ‌లాన్ని చాటే అవ‌కాశ‌మున్న సినిమాలు చేశారు. కానీ త‌ర్వాత త‌ర్వాత ఆయ‌న పూర్తిగా మాస్ మ‌సాలా సినిమాల‌కే ప‌రిమితం అయిపోయారు.

ప్రేక్ష‌కులు త‌న‌ను ఇలాంటి సినిమాల్లోనే చూడాల‌నుకుంటార‌ని.. రుద్ర‌వీణ లాంటి సినిమాలు చేస్తే డ‌బ్బులు రావ‌ని గ‌తంలో స‌మ‌ర్థించుకునేవారు చిరు. ఐతే ఇప్పుడు చిరు వ‌య‌సు పెరిగింది. ఇమేజ్ మారింది. ప్రేక్ష‌కుల అభిరుచి కూడా మారింది. కానీ ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ బాట వీడ‌ట్లేదు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం చిరు వ‌రుస‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తోనే వైవిధ్యం చూపించే సుకుమార్, త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తోనూ ఆయ‌న ప‌ని చేయ‌ట్లేదు. అదే స‌మయంలో హ‌ను రాఘ‌వ‌పూడి, వివేక్ ఆత్రేయ‌, త‌రుణ్ భాస్క‌ర్, గౌత‌మ్ తిన్న‌నూరి లాంటి మంచి అభిరుచి ఉన్న యువత‌రం ద‌ర్శ‌కుల వైపూ చూడ‌ట్లేదు.

వెంకీ కుడుముల‌తో సినిమా క్యాన్సిల్ అయ్యాక చిరు.. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌, వ‌శిష్ఠ లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ల వైపే చూస్తున్నాడు కానీ.. పైన చెప్పుకున్న ద‌ర్శ‌కులెవ‌రూ ఆయ‌న లైన్లోకి రాలేక‌పోతున్నారు. ఇంత‌కుముందులా ఇమేజ్ బ్యాగేజ్ ఏమీ లేని నేప‌థ్యంలో చిరు ఇప్పుడైనా డిఫ‌రెంట్ సినిమాలు తీసే యువ ద‌ర్శ‌కుల వైపు చూస్తే, ప్ర‌మోగాత్మ‌క చిత్రాలు చేస్తే బాగుంటుంద‌ని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్ష‌కులు ఆశిస్తున్నారు.

This post was last modified on May 7, 2023 6:56 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

48 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago