అక్కినేని లెగసీ మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు ప్రమాదంలో పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాగార్జున ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు. కానీ ఆయన తర్వాత ఈ వారసత్వాన్ని నాగచైతన్య, అఖిల్ అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారనే బాధ అక్కినేని అభిమానుల్లో ఉంది. నాగ్ సైతం మునుపటి జోరు చూపించలేక ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధానంగా ఆందోళన చైతూ, అఖిల్‌ల విషయంలోనే ఉంది.
చైతూకు మాస్ ఇమేజ్ రాకపోవడం మైనస్ అయితే.. అఖిల్ అసలు హీరోగా ఇంత వరకు సక్సెస్ ఫుల్ అనిపించుకోకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు ఎన్నో ప్రయోగాలు, సంచలనాత్మక చిత్రాలు చేసి ట్రెండ్ సెట్ చేయడమే కాక ఎంతోమంది ప్రతిభావంతులకు లైఫ్ ఇచ్చిన నాగ్.. తన కొడుకుల కెరీర్లను మాత్రం సరిగా ప్లాన్ చేయలేకపోతున్నాడనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.
ఐతే తమ కెరీర్ల విషయంలో నాగ్‌ను ఎంతమాత్రం నిందించడానికి వీల్లేదని అంటున్నాడు చైతూ. అఖిల్ కొత్త చిత్రం ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ కావడంతో నాగ్ మీద విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో చైతూ స్పందించాడు. తమ ఇద్దరికీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వడానికైనా నాగ్ సిద్ధంగా ఉంటాడని అతను తెలిపాడు. ‘‘నేను కానీ, అఖిల్ కానీ ఇప్పటికిప్పుడు ఫలానా డైరెక్టర్‌తో మాకు సినిమా చేయాలని ఉంది అని చెబితే కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్‌కి వెళ్లి సినిమా సెట్ చేస్తారు నాన్న. మీకు ఏ డైరెక్టర్ కావాలో అడగండ్రా, అడ్వాన్స్ పంపిస్తాను అని చాలా సార్లు అడిగారు. ఇందులో నాన్న తప్పు ఏమీ లేదు. మేం నాన్న వాళ్ల మీద ఆధారపడకుండా మా సొంతంగా మేం ఎదగాలని అనుకుంటున్నాం’’ అని నాగచైతన్య తెలిపాడు.
చైతూ ఈ మాట అన్నాక ఇక ఎవ్వరూ నాగ్‌ను నిందించడానికి వీల్లేదు. ఒకప్పుడు ఏఎన్నార్ మీద ఆధారపడకుండానే నాగ్ ఎదిగినట్లే చైతూ, అఖిల్ కూడా ఎదగాలని అనుకుంటున్నారన్నది స్పష్టం. ఐతే జడ్జిమెంట్ విషయంలో నాగ్ అనుభవాన్ని వాళ్లు కొంచెం ఉపయోగించుకుంటే, సలహాలు తీసుకుంటే బెటర్.
This post was last modified on May 6, 2023 3:23 pm
ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్…
కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…
సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…
పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…