Movie News

చిరంజీవి సినిమాలో సిద్ధు, శ్రీలీల

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా ఎంపిక విషయంలో గట్టిగానే కసరత్తు చేస్తున్నారు కొన్ని రోజులుగా. ‘భోళా శంకర్’ తర్వాత వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో ఆయన కొత్త కథ, దర్శకుడిని వెతుక్కోవాల్సి వచ్చింది. ఐతే ఏదో ఒకటి అని కాకుండా రకరకాల ఆప్షన్లను పరిశీలిస్తున్నాడు. దాదాపు అరడజను టీమ్స్ ఆయన కోసం వేర్వేరుగా కథలు తయారు చేసే పనిలో ఉన్నాయి.

ముందు మాట మాత్రంగా వారికి ఓకే చెప్పి.. ఫుల్ స్క్రిప్టులతో రావాలని చిరు చెబుతూ వస్తున్నాడు. ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేస్తే వాళ్లకు చిరుతో అవకాశం దక్కుతుంది. ఐతే ఈ రేసులోకి లేటుగా వచ్చిన కళ్యాణ్ కృష్ణ.. చిరు ఆలోచనకు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు. అతను సిద్ధం చేసిన ఒక కథ చిరుకు బాగా నచ్చిందట. ఆ సినిమా దాదాపు ఓకే అయినట్లే అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. ఇందులో లీడ్ రోల్ చిరుదే అయినా.. ఒక యువ జంట పాత్రలు కీలకంగా ఉంటాయట. ఆ పాత్రల కోసం సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిరు ఇందులో నడి వయస్కుడిగా కనిపిస్తాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం సిద్ధు, శ్రీలీలలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చిరు సినిమాలో ఎలాంటి పాత్రలైనా సరే.. కళ్లు మూసుకుని వీళ్లిద్దరూ ఒప్పేసుకుంటారు అనడంలో సందేహం లేదు.

సిద్ధు, శ్రీలీల వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ చిరు కోసం డేట్లు కేటాయించడం గ్యారెంటీ. చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత కొణిదెలనే ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని అంటున్నారు. దీంతో పాటుగా యువి క్రియేషన్స్ బేనర్లో ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయన్నది ఆయన సన్నిహిత వర్గాల మాట.

This post was last modified on May 6, 2023 3:22 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago