Movie News

యాత్ర-2.. ప్లస్సా మైనస్సా?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలతో సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని భావిస్తోంది. పార్టీ పరంగా చేపడుతున్న అన్ని కార్యక్రమాలూ కూడా ఈ అంశం చుట్టూనే ఉండేలా చూసుకుంటోంది జగన్ అండ్ కో. మరోవైపు గత ఎన్నికల ముందు లాగే ‘సినిమా’ ద్వారా జనాలను ప్రభావితం చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది.

2019 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను ‘యాత్ర’ అనే సినిమా ద్వారా జనాల్లోకి తీసుకెళ్లారు. అది వైఎస్ అభిమానులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. మరోవైపు ఆర్జీవీతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమా తీయించి చంద్రబాబుకు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు. ఈ రెండు సినిమాలూ వైసీపీకి ప్లస్ అయ్యాయనడంలో సందేహం లేదు.

ఐతే ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ‘యాత్ర’ తీసిన మహి.వి.రాఘవ్‌యే ఈసారి జగన్ పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర-2’ తీయడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ రెండు సినిమాలు తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కానీ ఇవి వైసీపీకి ప్లస్సా మైనన్సా అనేదే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

పరిస్థితులు, రాజకీయ వాతావరణం, జనాల మూడ్ మనకు అనుకూలంగా ఉన్నపుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి ప్రయోజనం చేకూరుస్తాయి. కానీ దానికి భిన్నమైన పరిస్థితుల్లో ఇవి చేటు చేసే ప్రమాదం ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ‘యన్.టి.ఆర్’ సినిమా తీసి జనాల్లోకి వదిలారు. కానీ అప్పుడు జనాల మూడ్ వేరుగా ఉంది. టీడీపీ మీద వ్యతిరేకత, జగన్ పట్ల సానుకూలత ఉండటం వల్ల ‘యన్.టి.ఆర్’ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అదే సమయంలో ‘యాత్ర’ సక్సెస్ అయింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా చర్చనీయాంశంగా మారింది.

కానీ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తూ, జగన్‌ పట్ల సానుకూల అభిప్రాయం అంతకంతకూ కరిగిపోతున్న సమయంలో.. ఆయన్ని ఎలివేట్ చేస్తూ ‘యాత్ర-2’ తీస్తే బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. వైఎస్ లాగా జగన్ జనాల్లో గొప్ప నేతగా అయితే ఎప్పుడూ పేరు తెచ్చుకోలేదు. ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ లేరని కాదు కానీ.. తటస్థుల్లో, సామాన్య జనాల్లో వైఎస్ లాగా మంచి పేరు తెచ్చుకోలేదు. వైఎస్ లాగా లెజెండరీ స్టేటస్ అయితే అసలే రాలేదు. వైఎస్ మరణానంతరం తీసిన బయోపిక్ కావడం కూడా ‘యాత్ర’కు ప్లస్. అలా కాకుండా జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయన మీద సినిమా తీసి వదిలితే జనాలకు అతిగా అనిపిస్తుందే తప్ప.. ఎమోషనల్ కనెక్ట్ ఎంతమాత్రం ఏర్పడదు. కాబట్టి ఈ సినిమా విషయంలో వైసీపీ పునరాలోచించుకుంటేనే బెటర్.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago