ఆరేళ్ళ క్రితం స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ తెలుగుని లాంచ్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాన్ని నడిపించిన తీరు మంచి స్పందన తీసుకొచ్చింది. సినిమాల వల్ల తర్వాతి సీజన్లు వదిలేయాల్సి వచ్చింది కానీ ఇప్పటికీ ఈ షో ఫ్యాన్స్ తారక్ యాంకరింగ్ ని ఇష్టపడతారు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఎవరు మీలో కోటీశ్వరులుని హోస్ట్ చేయడం దాని పాపులారిటీని ఇంకా పెంచింది. యంగ్ టైగర్ కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడంతో జెమిని నెట్ వర్క్ వేరే స్టార్ తో సెకండ్ సీజన్ ని చేయడం ఇష్టం లేక వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పట్లో ఉండకపోవచ్చు.
ఇదిలా ఉండగా ఈటీవీ సైతం తారక్ తో ఓ మెగా టాక్ షో లాంటి ప్రోగ్రాంని డిజైన్ చేసే పనిలో ఉందని వినికిడి. శాటిలైట్ ఛానల్స్ రంగంలో పాతికేళ్ల క్రితం సరికొత్త విప్లవానికి తెరతీసిన ఈటీవీ ఇటీవలే ఓటిటిలోనూ అడుగు పెట్టింది. విన్ పేరుతో లాంచ్ చేసిన యాప్ కి సబ్స్క్రిప్షన్ రేట్లు పెట్టి థియేటర్ రిలీజ్ కాని స్ట్రెయిట్ సినిమాలను డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం కొంటోంది. అందులో భాగంగానే రవిబాబు అసలు లాంటివి నేరుగా అందులోనే వచ్చాయి. ఇప్పుడీ పాపులారిటీని మరింత పెంచడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు టాక్.
తారక్ కు ఈనాడుతో మంచి అనుబంధం ఉంది. తన డెబ్యూ మూవీ నిన్ను చూడాలని తీసింది ఉషాకిరణ్ సంస్థే. ఆ బ్యానర్ కున్న మార్కెటింగ్ నెట్వర్క్ వల్ల యావరేజ్ కంటెంట్ ఉన్న ఆ సినిమా జనంలోకి బాగానే వెళ్ళింది. అందుకే ఒకవేళ నిజంగా ఈ ప్రపోజల్ కార్యరూపం దాలిస్తే ఈటీవీకి ఓ అస్త్రం దొరికినట్టు అవుతుంది. అయితే జూనియర్ విపరీతమైన బిజీలో ఉన్నాడు. ముందు కొరటాల శివది పూర్తి చేయాలి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు తాలూకు పనులు అక్టోబర్ నుంచి మొదలుపెట్టాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంత టైట్ షెడ్యూల్స్ మధ్య బుల్లితెర రీ ఎంట్రీ ఇవ్వడం సులభం కాదు
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…