వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గత యాభై రెండేళ్లలో బంగ్లాదేశ్ థియేటర్లలో ఒక్క హిందీ సినిమా రిలీజ్ కాలేదు. 1971 తర్వాత అప్పటి దేశవిభజన పరిస్థితులు, మత కల్లోలాలతో పాటు కఠినంగా ఉండే అక్కడి చట్టాల వల్ల మన చిత్రాలను ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. ప్రాధమికంగా అక్కడ ఉన్నదే 150కి కొంచెం అటు ఇటుగా ఉన్న స్క్రీన్లు. అంటే ఒక్క హైదరాబాద్ నగరం మొత్తంతో పోల్చుకున్నా వాటిలో పావు వంతు కూడా ఆ దేశంలో లేవంటే షాక్ కలగక మానదు. ఇండియన్ మూవీ అంటే టీవీ లేదా ఇంటర్నెట్ తప్ప మరో మార్గం లేదు వాళ్లకు.
ఇంత సుదీర్ఘమైన నిరీక్షణకు బ్రేక్ పడింది. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ పఠాన్ ని ఈ నెల 12న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇది చారిత్రాత్మకమని ఇప్పటిదాకా కేవలం బెంగాలీ బంగ్లా లాంటి ప్రాంతీయ బాషా చిత్రాలకు మాత్రమే పరిమితమైన తమ మార్కెట్ దీని వల్ల విస్తృతంగా పెరుగుతుందని బంగ్లా బయ్యర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ట్రెండ్ కనక కొనసాగితే కార్పొరేట్ సంస్థలు మల్టీప్లెక్సులు కట్టడానికి ముందుకు వస్తాయని సగటు మూవీ లవర్స్ ఆశపడుతున్నారు. పఠాన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చినప్పటికి బంగ్లాదేశ్ లో స్ట్రీమింగ్ రాదు
ఇలా జరగడానికి కారణం ఉంది. 1980 టైంలో బంగ్లాదేశ్ లో బాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకుని లెక్కలేనన్ని కమర్షియల్ సినిమాలు తీశారు. డబ్బులు బాగానే వచ్చేవి. అయితే 2000 తర్వాత నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం క్వాలిటీకి తిలోదకాలు ఇవ్వడంతో జనం థియేటర్లకు రావడం తగ్గించేశారు. దీంతో స్లంప్ ఏర్పడింది. గత పదేళ్లలో కొంతవరకు రికవర్ అయ్యింది కానీ భారతీయ కంటెంట్ ని అనుమతించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఫైనల్ గా దానికి చెక్ పడింది. బజ్ చూస్తుంటే పఠాన్ ఈజీగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు. అదే జరిగితే మనకు మరో మార్కెట్ తోడైనట్టే
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…