పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు హరీష్. ఆశ్చర్యకరంగా ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను వేరే దర్శకుడి చేతిలో పెట్టిన పవన్.. తన కోసం హరీష్ చాలా ఏళ్లు ఎదురు చూసేలా చేశాడు. చివరికి నాలుగేళ్ల ముందు హరీష్‌తో సినిమాకు సూచన ప్రాయంగా అంగీకరించినా.. ఆ సినిమా పట్టాలెక్కడానికి చాలా టైం పట్టేసింది.
సినిమాకు టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాక ఏళ్లకు ఏళ్లు హరీష్ పవన్ కోసం ఎదురు చూడాల్సి రావడం షాకింగే. ఈ నిరీక్షణ వల్ల హరీష్ కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. పవన్ నుంచి ఇలాంటి రూడ్ షాక్స్ చాలా తిన్న హరీష్‌కు ఎట్టకేలకు కొన్ని నెలల కిందట సానుకూల స్పందన వచ్చింది. ఈ సినిమాకు ముహూర్త వేడుక జరిపారు. అలాగే గత నెల షూటింగ్ కూడా మొదలైంది.
పవన్ సెట్స్‌లోకి వచ్చే వరకు గ్యారెంటీ లేదు అన్నట్లుగా.. చిత్ర బృందం ఉత్కంఠతో ఎదురు చూడగా ఏప్రిల్ రెండో వారంలో పవన్ వారి నిరీక్షణకు తెరదించాడు. రెండు వారాల పాటు డేట్లు ఇచ్చి విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం హరీష్ అండ్ టీంకు పెద్ద సర్ప్రైజే. ఆ షెడ్యూల్ అవ్వగానే ‘ఓజీ’ షూట్ కోసం ముంబయి వెళ్లాడు పవన్. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ నెలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ ఏమీ లేదు. అందరూ రిలాక్స్ అయిపోయారు.
కానీ సడెన్ సర్ప్రైజ్ అన్నట్లు పవన్.. నెల మధ్యలో రెండు రోజులు డేట్లు ఇచ్చాడట. హరీష్ అండ్ టీంకు ఈ విషయం చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారట. హడావుడిగా ఆ రెండు రోజుల షూట్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు షాక్‌లే ఇచ్చిన పవన్.. ఇప్పుడు స్వీట్ సర్ప్రైజులు ఇస్తున్నాడని టీంలో జనాలు అనుకుంటున్నారు. మున్ముందు ఇలాంటి సర్ప్రైజులు ఇంకెన్ని ఇస్తాడో చూడాలి.
This post was last modified on May 6, 2023 10:38 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…