పేరుకి టీవీ యాంకరే కానీ అనసూయకున్న ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు. జబర్దస్త్ నుంచి రంగస్థలం దాకా టీవీ సినిమా రెండిట్లోనూ వరస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లతో కయ్యం పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఆన్ లైన్ గొడవలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల వరకు వెళ్లాయి. వీటి సంగతలా ఉంచితే నిన్న అనసూయ మరోసారి ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేయడం ఫ్యాన్ లో దుమారం రేపుతోంది. హీరో పేరు ప్రస్తావించకపోయినా ఎవరి గురించో అర్థమయ్యేలాగే కౌంటర్ వేసింది.
నిన్న విడుదలైన ఖుషి లిరికల్ సాంగ్ అప్ డేట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది(THE) అని ఉంది. మాములుగా అత్యున్నత వ్యక్తులకు గౌరవం ఇచ్చే క్రమంలో దీన్ని వాడతారు. ది ప్రెసిడెంట్, ది చీఫ్ మిస్టర్ టైపులో. అలా అని సామాన్యులు, సెలబ్రిటీలు పెట్టుకోవడం చట్టవ్యతిరేకం కాదు. బహుశా మైత్రి టీమ్ లేదా రౌడీ హీరో ఈ కోణంలో అలోచించి పెట్టుకుని ఉంటారు. ఇందులో తీవ్రంగా తప్పుబట్టాల్సింది ఏమి లేదు. అయితే ఆ ది పదాన్ని ఆక్షేపించిన అనసూయ ఆ పైత్యం తనకూ అంటుకోకపోతే మంచిదని అయ్యబాబోయ్ అని ట్వీట్ పెట్టి వదిలేసింది
ఇది కాస్తా వైరల్ కావడంతో దేవరకొండ ఫ్యాన్స్ కౌంటర్స్ మొదలుపెట్టారు. కొందరు సూటిగా కొందరు అసభ్యంగా కామెంట్లు పెట్టారు. ట్విట్టర్ అంటేనే ముప్పాతిక ఫేక్ ఐడిల ప్రపంచం కాబట్టి ఇదంతా టైం వేస్ట్ యవ్వారం. అయినా సరే అనసూయ తగ్గకుండా వాళ్లకు చురకలు వేస్తూనే ఉంది. ఇప్పుడే కాదు అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అన్న మాట దగ్గరి నుంచి అనసూయ ఏదో ఒక రూపంలో ఇలా టార్గెట్ చేస్తూనే ఉందని అభిమానుల వెర్షన్. ఏది ఎలా ఉన్నా చక్కగా మూడు సినిమాలు ఆరు షోలు చేసుకుని వెలిగిపోతున్న టైంలో ఈ రాద్ధాంతం ఎందుకనే వాళ్ళు లేకపోలేదు
This post was last modified on May 6, 2023 6:51 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…