ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ విషయంలో అభిమానులు ఎంత కంగారు పడ్డారో తెలిసిందే. చిత్ర బృందం కూడా ఒక దశలో ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని తెగ కంగారు పడిపోయింది. ‘ఆదిపురుష్’ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి. ఐతే ఆ నెగెటివిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.
వీఎఫెక్స్ కరెక్షన్ల తర్వాత సినిమా మెరుగ్గా తయారైందని అంటున్నారు. అంతే కాక త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ విషయంలో కూడా బాలీవుడ్ అంతర్గత వర్గాల టాక్ బాగుంది. ఇక ప్రమోషన్ల విషయంలోనూ చిత్ర బృందం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోవడం అన్నింటకంటే కలిసి వచ్చే అంశం కానుంది.
జూన్ నెల 16న ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుండగా.. అంతకు రెండు వారాల ముందే షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ రిలీజ్ కావాల్సింది. జూన్ 2న రిలీజ్‌కు చాన్నాళ్ల ముందే డేట్ ఇచ్చారు. అట్లీ లాంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్ తీసిన సినిమా కావడం.. ‘పఠాన్’ తర్వాత షారుఖ్ చేసిన చిత్రం కావడంతో ‘జవాన్’కు మంచి హైపే ఉంది. ‘జవాన్’కు మంచి టాక్ వస్తే కొన్ని వారాల పాటు బాక్సాఫీస్‌లో డామినేట్ చేసే అవకాశముంది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి వీఎఫెక్స్, ఇతర వర్క్స్ పెండింగ్ ఉండటంతో జూన్ 2 డెడ్ లైన్‌ను అందుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో సినిమాను వాయిదా వేసేశారు. ఆల్రెడీ వేసవిలో సరైన సినిమాలు పడక బాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. సౌత్‌లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ లాంటి టాప్ స్టార్ నటించిన భారీ చిత్రం జూన్లో రిలీజైతే అందరి దృష్టీ దాని మీదికి మళ్లుతుంది. పాజిటివ్ టాక్ వస్తే రికార్డు మోత మోగడం ఖాయం.
This post was last modified on May 6, 2023 10:38 am
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా…
ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.…
దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి…
ఇవాళ విడుదలైన ఉపేంద్ర యుఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలని…