ఒకప్పుడు సౌత్ సినిమాలంటే ఓ రకమైన చులకన భావంతో చూసేవాళ్లు బాలీవుడ్ భామలు. ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ సెటిలైన తర్వాత కూడా ఇలాంటి ‘ఛీప్’ కామెంట్స్ చేసిన ముద్దుగుమ్మలూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘బాహుబలి’ సినిమాతో యావత్ భారతానికి టాలీవుడ్ స్టామినా ఏంటో తెలిసింది. దాంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగులో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓ టాలెంటెడ్, గ్లామరస్ హీరోయిన్, తెలుగులో నటించాలని ఉందంటూ ప్రకటించింది.
మొదటి సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్. ‘దమ్ లాగ కే హైసా’ మూవీలో భారీ కాయం ఉన్న గృహిణిగా భూమీ నటనకు ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ స్లిమ్ లుక్‌లోకి వచ్చిన భూమీ… విలక్షణమైన సినిమాలనే ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ సీన్స్‌లో నటించడానికి కూడా ఏ మాత్రం మొహమాటపడని భూమీ… తన నటనతో హీరోలనే డామినేట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్ సినిమాల్లో నటించకూడదని ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వస్తే, తెలుగు సినిమాల్లో నటించాలనే ఆశగా ఉంది’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భూమీ. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్న భూమీ పెడ్నేకర్… టాలీవుడ్ స్టార్ హీరోలకు ఓ మంచి ఆప్షన్ అవుతుంది.
అయితే ఇంతకుముందు ఇలాగే… అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమని ప్రకటించిన బాలీవుడ్ భామలు, తీరా ఛాన్సిచ్చాక భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు. దాంతో తెలుగు నిర్మాతలు వెనక్కి రావాల్సి వచ్చింది. అదీగాక బాలీవుడ్‌లో భూమీ నటించిన ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’, ‘శుభ్ మంగల్ సావ్‌ధాన్’, ‘బాలా’, వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. మరి ఈ గోల్డెన్ లెగ్ తెలుగులో నటించేందుకు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందోనని భయపడుతున్నారు తెలుగు నిర్మాతలు. ఈ ‘లస్ట్ స్టోరీస్’ పాప కోరినంత ఇచ్చి, టాలీవుడ్‌కి తీసుకొచ్చే నిర్మాత ఎవ్వరో చూడాలి.
This post was last modified on April 24, 2020 4:25 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…