Allari naresh
ఈ వేసవిలో భారీ చిత్రాలు లేకపోవడం ప్రేక్షకులకు తీవ్ర నిరాశ కలిగించేదే. పోనీ ఉన్న వాటిలో అయినా సరైన సినిమాలు పడుతున్నాయా అంటే అదీ లేదు. ఈ సమ్మర్లో ఇప్పటిదాకా పూర్తిగా సంతృప్తి పరిచి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా ఏదీ లేదనడంలో సందేహం లేదు. ఉన్నంతలో దసరా, విరూపాక్ష సినిమాలకు మంచి టాక్ వచ్చింది. వాటినే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. మిగతా సినిమాలన్నీ తుస్సుమనిపించినవే.
గత వారం వచ్చిన ఏజెంట్ అయితే వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఇక ఈ వారం రెండు మిడ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అందులో గోపీచంద్ సినిమా రామబాణం.. ట్రైలర్‌తో ఎలా ఉస్సూరుమనిపించిందో.. అంతకుమించి సినిమాగా అంతకుమించి నిరాశకు గురి చేసింది. తక్కువ అంచనాలతో వెళ్లినప్పటికీ.. మినిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయిందీ సినిమా.
రామబాణం టాక్ కానీ.. ఓపెనింగ్స్ కానీ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో పాటు రిలీజైన ఉగ్రం సినిమా మాత్రం బెటర్ టాక్ తెచ్చుకుంది. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం నాంది స్థాయిలో లేకపోయినా.. ఇది కూడా విషయం ఉన్న సినిమానే. కొన్ని ఎపిసోడ్లు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కొన్ని మెరుపులున్నాయి. అల్లరి నరేష్ పెర్ఫామెన్స్ కూడా మెప్పిస్తోంది.
ఏమీ లేని సమయంలో ఓ మోస్తరు సినిమా పడ్డా ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. రెండు వారాల ముందు వచ్చిన విరూపాక్ష ఇప్పటికీ ప్రభావం చూపుతున్నప్పటికీ.. ప్రేక్షకులకు కొత్త సినిమాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అందులో టాక్ బాగున్నదాన్ని ఎంచుకుంటారు. ఈ రకంగా ఉగ్రంకి బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నట్లే. ఈ సానుకూలతను ఉపయోగించుకుంటే నరేష్ కెరీర్లో ఇంకో హిట్ పడబోతున్నట్లే.
This post was last modified on May 6, 2023 8:49 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…