ఈ నెలలో చెప్పుకోదగ్గ అంచనాలతో విడుదలవుతున్న సినిమాల్లో కస్టడీనే ముందు వరసలో ఉంది. ఏజెంట్ తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోతాయనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన ఈ కాప్ థ్రిల్లర్ లో అరవింద్ స్వామి విలన్ గా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్. ఒక తెలుగు మూవీకి ఇళయరాజా యువన్ శంకర్ రాజా కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. మే 12న రిలీజ్ కాబోతున్న కస్టడీ మీద హైప్ పెంచే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. అదీ వచ్చేసింది
శివ(నాగచైతన్య) చిన్న కానిస్టేబుల్. డ్యూటీలో ఎంత సిన్సియర్ అంటే ఏదైనా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే సిఎం కాన్వాయ్ ఆపి మరీ చెప్పేంత. అలాంటి యువకుడికి అతి పెద్ద సవాల్ ఎదురవుతుంది. ప్రభుత్వ వ్యవస్థ కంటికి రెప్పలా కాపాడుతున్న కరుడు గట్టిన దుర్మార్గుడి(అరవింద్ స్వామి)ని జైలు నుంచి తప్పించి ఒక చోటికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ప్రియురాలు(కృతి శెట్టి)వారిస్తున్నా రిస్క్ కు సిద్ధపడతాడు. దీని వల్ల స్వంత డిపార్ట్ మెంట్ కే శత్రువుగా మారతాడు. ఏకంగా ప్రాణాల మీదకు వస్తుంది. అసలిదంతా శివ ఎందుకు చేశారు.
వీడియో మొత్తం మంచి ఇంటెన్సిటీతో సాగింది. విజువల్స్ లో ఎక్కడా రొటీన్ కమర్షియల్ సినిమా అనే భావన కలగకుండా వెంకట్ ప్రభు తనదైన మేకింగ్ స్టైల్ తో నింపేశారు. శరత్ కుమార్, ప్రియమణి లాంటి ఇతర సీనియర్ ఆర్టిస్టులతో ఒక హై వోల్టేజ్ డ్రామా చూడబోతున్న ఫీలింగ్ అయితే కలిగించారు. నేపధ్య సంగీతం యువన్ శైలిలో సాగగా చైతు స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంది. నటన పరంగా కొత్త ఛాలెంజ్ నే స్వీకరించాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రాబోతున్న కస్టడీ కు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే బొమ్మ హిట్టే
This post was last modified on May 6, 2023 8:51 am
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…