తెలుగు సినీరంగంలో ధ్రువతారగా వెలుగొంది, రాజకీయంలో తిరుగులేని నాయకుడుగా, అశేష ప్రజల మనస్సుల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ డా. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నందు మే 20 తారీఖున ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగబోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం 2018 నుంచి ప్రతి సంవత్సరం తారకరాముని జన్మదిన వేడుకలను జర్మనీ లో నివసిస్తున్న తెలుగువారితో మినీ మహానాడు గా ఘనంగా జరుపుకుంటారు.
ఈసారి కూడా శతజయంతి ని మునిపెన్నడూ లేని విధంగా జరపాలి అని తెలుగుదేశం జర్మనీ విభాగపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.
రాబోయే సంవత్సరంలో ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీకి తమవంతు సహాయంగా ఎలా ఉపయోగపడాలో తీర్మానాల ద్వారా చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయి తమ సందేశాలను పంచుకుంటారు అని కమిటీ సభ్యులు తెలిపారు.
జర్మనీలో నివసిస్తున్న ప్రతి తెలుగువాడు మినీ మహానాడుకి హాజరయి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించవలసినదిగా కోరారు.
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on May 5, 2023 7:31 am
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…