ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలే నడుపుతాయని.. అది చాలా పెద్ద వ్యవహారం అని.. పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుందని.. ఓటీటీ మొదలుపెట్టినా దాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ ఆలోచన తప్పు అని రుజువు చేశాడు అల్లు అరవింద్.
ఓ నిర్మాతగా తన దగ్గరున్న సినిమాలకు తోడు.. కొన్ని కొత్త చిత్రాలు కొని పెట్టి ‘ఆహా’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మొదలుపెట్టారాయన. వాటితో సరిపెట్టకుండా సొంతంగా వెబ్ సిరీస్‌లు తయారు చేసి అందులో రిలీజ్ చేశారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సినిమాల్ని ‘ఆహా’లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
‘భానుమతి రామకృష్ణ’ సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. ఐతే ఇలా నిలకడగా కొత్త సినిమాల్ని డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డిజిటల్ హక్కుల్ని ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకోవాలన్నా ఖర్చు ఎక్కువే.
అందుకే అరవింద్ సెకండ్ హ్యాండ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఆల్రెడీ వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజైన సినిమాల్ని తీసుకుని కొంచెం లేటుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం వేరే ఓటీటీలతో టై అప్ అవుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఐదారు రోజులు ఆలస్యంగా ‘ఆహా’లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనే ఉన్న ‘ఫోరెన్సిక్’ చిత్రాన్ని కూడా తీసుకుని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ను కూడా ఇలాగే రిలీజ్ చేయబోతున్నారట. ఇంకా అమేజాన్‌లో ఉన్న ‘ట్రాన్స్’ హక్కులు కూడా తీసుకుని తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు.
ఇది ఎక్స్‌క్లూజివ్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్. వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో వేరే భాషల్లో ఉన్న చిత్రాల్ని తీసుకుని అనువాదం చేసి ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ సినిమాలు తీసుకుని నేరుగా రిలీజ్ చేయడం, లేదంటే అనువాదం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో కంటెంట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు వారు.
This post was last modified on August 6, 2020 2:07 pm
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…