Movie News

ర‌జినీ సినిమా.. స‌క‌ల భాషా న‌టుల స‌మ్మేళనం

ముందు అనుకున్న ప్ర‌కారం అయితే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం జైల‌ర్ త‌మిళ నూత‌న సంవ‌త్స‌రాది కానుక‌గా ఏప్రిల్ 14నే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సినిమా వాయిదా ప‌డింది. కొత్త డేట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పేసింది నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్.

వేస‌వి త‌ర్వాత క్రేజీ సీజ‌న్ అయిన ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను ఈ సినిమా ఎంచుకుంది. ఆగ‌స్టు 10న జైల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. విశేషం ఏంటంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం భోళా శంక‌ర్ కూడా అప్పుడే రిలీజ్ కాబోతోంది. ఆగ‌స్టు 11న ఆ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మెగాస్టార్, సూప‌ర్ స్టార్‌ల ఆస‌క్తిక‌ర పోరును చూడ‌బోతున్నాం ఈ ఏడాది.

జైల‌ర్ రిలీజ్ డేట్‌ను ఒక ఆస‌క్తిక‌ర వీడియో ద్వారా ప్ర‌క‌టించింది చిత్ర బృందం. డైలాగ్స్, సీన్స్ ఏమీ లేకుండా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న న‌టీన‌టుల గ్లింప్స్ మాత్ర‌మే చూపించి చివ‌ర్లో సూప‌ర్ స్టార్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్. ఈ వీడియో చూస్తే జైల‌ర్ ద‌క్షిణాదిన‌ స‌క‌ల భాషా న‌టుల సంగ‌మం లాగా క‌నిపిస్తోంది.

టాలీవుడ్ నుంచి సునీల్, నాగ‌బాబు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించ‌గా.. శాండిల్‌వుడ్ నుంచి శివ‌రాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఇక మ‌ల‌యాళం నుంచి మోహన్ లాంటి టాప్ స్టార్ ఈ సినిమాలో ఉన్నాడు. వీరు కాక త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ లాంటి అన్ని భాష‌ల వాళ్ల‌కూ ప‌రిచ‌యం ఉన్న న‌టీమణులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ వీడియో గ్లింప్స్ సినిమా మీద అంచ‌నాలు పెంచేలాగే ఉంది. ఆగ‌స్టు 10న సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు పెద్ద ట్రీటే ఉండబోతోంది.

This post was last modified on May 5, 2023 7:29 am

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

1 hour ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago