సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విస్టు ఇచ్చేశారు. జైలర్ విడుదల ఆగస్ట్ నుంచి వాయిదా పడిందనే వార్తల నేపథ్యంలో అలాంటిదేమీ లేదని అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఆగస్ట్ 10 అఫీషియల్ రిలీజ్ డేట్ గా టీజర్ తో సహా ఖరారు చేశారు. కోకోకోకిల, డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో చాలా ప్రత్యేకతలున్నాయి. శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తుండగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో క్యామియో రోల్ చేయించారు. మన సునీల్ తో పాటు బాలీవుడ్ నుంచి జాకీశ్రోఫ్ లాంటి ఇతర క్యాస్టింగ్ గట్టిగానే ఉంది.
చిన్న వీడియో బిట్టే అయినా అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి కిక్ ఇచ్చేలా ఉంది. అయితే ఆగస్ట్ 11 భోళా శంకర్ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ vs సూపర్ స్టార్ క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. ఆ వారం విపరీతమైన పోటీ ఉంది. సందీప్ వంగా యానిమల్, సన్నీ డియోల్ గదర్ లు రేస్ లో ఉన్నాయి. థియేటర్ల పరంగా ఇతర రాష్ట్రాల్లో కాంపిటీషన్ తీవ్రంగా ఉండనుంది. స్క్రీన్ల సర్దుబాటు పరంగా బయ్యర్లకు చిక్కులు తప్పవు. భోళా శంకర్ కు ఎలాగూ తమిళనాడు అవసరం లేదు. వేదలమ్ రీమేక్ కాబట్టి అక్కడ రిలీజ్ చేస్తే లేనిపోని పోలికలు వస్తాయి.
అంత రిస్క్ తీసుకోవడం కంటే వాల్తేరు వీరయ్య లాగా లోకల్ కి పరిమితం కావడం బెస్ట్. జైలర్ మీద అంచనాలు బాగున్నాయి. పెద్దన్న దారుణంగా డిజాస్టర్ అయ్యాక రజని తిరిగి కుర్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే జైలర్ కు ఓటేశారు. జైలు అధికారిగా ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందట. బయట ఉన్న క్రిమినల్స్ ని లోపలికి తీసుకొచ్చే మిషన్ తో అధిక శాతం స్టోరీ ఒక్క రాత్రిలోనే జరుగుతుందని ఇన్ సైడ్ టాక్. విజయ్ తో బీస్ట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నెల్సన్ ఆశలన్నీ జైలర్ మీదే ఉన్నాయి.
This post was last modified on May 5, 2023 7:27 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…