శ్రీను వైట్ల నుండి సినిమా వచ్చి కొన్నేళ్ళవుతుంది. అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో విష్ణు మంచుతో డీ కి సీక్వెల్ గా డీ అండ్ డీ అనే సినిమా ప్లాన్ చేసుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళకుండా క్యాన్సిల్ అయింది. దీంతో తనకి కలిసొచ్చిన మరో కామెడీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీ సిద్దం చేసుకొని గోపీచంద్ కి వినిపించాడు. శ్రీను వైట్ల వంటి దర్శకుడు వచ్చి సినిమా అనడంతో మ్యాచో స్టార్ ఒకే అనేశాడు.
ఈ కాంబో సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.ఎనౌన్స్ మెంట్ కూడా రాలేదు. తాజాగా గోపీచంద్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. శ్రీను వైట్లతో చేయబోయే సినిమా వర్క్ జరుగుతుందని తెలిపాడు. దీంతో ఈ కాంబో ఫిక్స్ అనేది క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం రైటర్ గోపీమోహన్ తో కలిసి శ్రీను వైట్ల స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. జులై లేదా ఆగస్ట్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లోపు హర్ష డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించి కొంత ఘాట్ కంప్లీట్ చేస్తాడు గోపీచంద్. ఇక శ్రీను వైట్ల తో పాటు తేజ కి కూడా గోపీచంద్ ఓ సినిమా చేయనున్నాడు.
ఆ సినిమాకి స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్ గురించే సినిమా ఆగింది. సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకం కావడంతో సరైన హీరోయిన్ వేటలో ఉన్నాడు తేజ. కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించే హీరోయిన్ దొరికిన వెంటనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.
This post was last modified on May 5, 2023 7:26 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…