Movie News

వెంకటేష్ తప్పించుకున్న రిస్కీ రీమేక్

ఎప్పుడైనా సరే రీమేకులు రిస్కే. ఒరిజినల్ ఫలితాలే రిపీట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి ఇండస్ట్రీ రికార్డులు పడతాయి. ఇంకోసారి తుస్సుమని నష్టాలు తెస్తాయి. ఇవి రెండు వైపులా ఉన్న కత్తి లాంటివి. అయితే విక్టరీ వెంకటేష్ కు ఈ విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువ. చంటి, సూర్యవంశం, రాజా, వసంతం, ఘర్షణ లాంటివన్నీ మాములు హిట్లు కాదు. అందుకే లేట్ వయసులోనూ దృశ్యం, నారప్ప లు చేస్తూనే వచ్చారు. అయితే లక్కీగా ఆయన తప్పించుకున్న మన ఆడియన్స్ టేస్ట్ కి అంతగా సూటవ్వని ఒక బాలీవుడ్ మూవీ ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు.

2019లో అజయ్ దేవగన్ హీరోగా దే దే ప్యార్ దే వచ్చింది. టబు భార్య, రకుల్ లవర్ గా చేశారు. వయసొచ్చిన పిల్లలున్న మనిషి భార్య ఉండగానే ఓ యవ్వనపు యువతి ప్రేమలో పడతాడు. దీంతో వాళ్ళ జీవితంలో అనూహ్యమైన మార్పులు చౌటు చేసుకుంటాయి. సరదాగా సాగుతూ ఆ తర్వాత ఎమోషనల్ టర్న్ తీసుకుని హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. దీన్ని తెలుగులో వెంకటేష్ తో తీయాలని నిర్మాత సురేష్ బాబు హక్కులు కొన్నారు. ఇప్పుడు రామబాణం తీసిన శ్రీవాస్ దర్శకుడిగా రచయిత గోపి మోహన్ తదితరులతో స్క్రిప్ట్ వర్క్ చేయించి ఆర్టిస్టులకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు.

ఈలోగా ధనుష్ అసురన్ చూసిన వెంకీకి హఠాత్తుగా దాని పైకి మనసు మళ్లింది. దే దే ప్యార్ దే లాంటివి ఎన్నో చేశాం కదా నటనకు స్కోప్ ఉన్నది కాబట్టి నారప్పకు ఓటు వేశారు. దీంతో శ్రీవాస్ కష్టమంతా పక్కకెళ్ళిపోయింది. ఈలోగా కరోనా రావడం, పరిస్థితులు మారిపోవడంతో పూర్తి చేసిన స్క్రిప్ట్ వృథాగా మిగిలిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని ఓటిటిలో చాలా మంది చూసేశారు. అయినా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అలా భార్యపిల్లలను వదిలేసి అమ్మాయి వెంట పడే పాత్రంటే మన ఆడియన్స్ అంత సులభంగా రిసీవ్ చేసుకోలేరు. అందుకే వదులుకోవడమే మంచిదైంది

This post was last modified on May 5, 2023 7:26 am

Share
Show comments
Published by
Satya
Tags: Venkatesh

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago