వచ్చే వారం విడుదల కాబోతున్న కస్టడీకి సంబంధించిన ట్విస్టులను యూనిట్ ముందే చెప్పేస్తోంది. నాగ చైతన్య ఇది విలన్ చనిపోకుండా ఉండేందుకు హీరో చేసే యుద్ధమని, పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని లీక్ ఇచ్చేశాడు. నలభై ఎనిమిది గంటల నిడివిలో ప్రతినాయకుడిని కాపాడుకోవడమే కానిస్టేబుల్ శివ లక్ష్యంగా ఉంటుంది. కానీ ఇతన్ని చంపే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు అరవింద్ స్వామి పోషించిన రౌడీ షీటర్ పాత్ర. గతంలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో చాలా వచ్చాయి
కానీ ఈ లైన్ స్పెషల్ గా ఉంది.
మే 12 తెలుగు తమిళంలో ఒకేసారి రిలీజ్ కాబోతున్న కస్టడీకి పోటీ లేని కారణంగా మంచి విడుదల దక్కనుంది. దాదాపుగా సినిమా మొత్తం చైతు, అరవింద్ స్వామి రెండే కాస్ట్యూమ్స్ లో ఉంటారు. ఎలాంటి అనవసర పాటలు, ఐటెం సాంగులు, కామెడీ ట్రాక్స్ లేకుండా సీరియస్ నెరేషన్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించారు. పాత్ర పేరు శివ కావడం ఫ్యాన్స్ సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. నాగ చైతన్యకు థాంక్ యు, లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ల తర్వాత చేసిన మూవీ కావడంతో కస్టడీ సక్సెస్ కావడం చాలా ముఖ్యం. పాజిటివ్ వైబ్స్ అయితే బలంగానే కనిపిస్తున్నాయి.
ఇలా ఓపెన్ గా స్టోరీని చెప్పేయడం ఒకరకంగా మంచిదే. ఆడియన్స్ ఏం చూడబోతున్నారో ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. లేనిపోనివి ఊహించుకుని వస్తే మాస్ ప్రేక్షకులు నిరాశ చెందే రిస్క్ ఉంటుంది. పైగా అభిమానులకు అడ్వాన్స్ గా క్లారిటీ వస్తుంది. అయితే ఇళయరాజా యువన్ శంకర్ రాజాల సంయుక్త సంగీతం ఎంతమేరకు కస్టడీకి ప్లస్ అయ్యిందో తెరమీద చూస్తే కానీ చెప్పలేం. లిరికల్ సాంగ్స్ కు రెస్పాన్స్ బాగానే ఉంది కానీ మరీ చార్ట్ బస్టర్ అనిపించుకునేలా ప్రస్తుతానికి లేవు. ఉప్పెన నాటి ఫేమ్ పూర్తిగా మాయమైపోయిన కృతి శెట్టికి కస్టడీ హిట్టు చాలా కీలకం
This post was last modified on May 5, 2023 3:08 am
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…