ఇంకో నెలన్నరలో విడుదల కాబోయే ఆది పురుష్ మీద దానికి ఖర్చు పెట్టినంత రేంజ్ లో హైప్ లేదు కానీ టీజర్ టైంలో వచ్చే నెగటివిటీని పోగొట్టేందుకు కావలసిన ప్లాన్ ని టి సిరీస్ సంస్థ సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న జరగబోయే ట్రైలర్ లాంచ్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 150 నుంచి 250 థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్టు వచ్చేసింది. ఈ కౌంట్ అనూహ్యంగా పెరగొచ్చని అంటున్నారు. మీడియా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఏఎంబి మాల్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అందరికీ త్రీడి వెర్షనే చూపించబోతున్నారు.
ఊహలకు అందని విధంగా మూడు నిమిషాల దాకా ఉన్న ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. గత ఏడాది వచ్చిన కామెంట్లకు బదులిచ్చేలా స్ట్రాంగ్ విజువల్స్ ని చూపించబోతున్నట్టు వినికిడి. సుమారు వెయ్యి కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. అంత రేట్లకు కొనడం గురించి పక్కనపెడితే టాకే ఆడియన్స్ ని తండోపతండాలుగా హాళ్లకు తీసుకొస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. అన్ని రాష్ట్రాలలో తగినన్ని థియేటర్లు దక్కేలా నిర్మాతలు ఇప్పటికే పావులు కదుపుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు
ప్రభాస్ ప్రమోషన్లలో భాగం కాబోతున్నాడు. ఇకపై శ్రీరాముడి గాథ అంటే కొత్త తరానికి ముందు ఆది పురుష్ గుర్తొచ్చే రేంజ్ లో అవుట్ ఫుట్ వచ్చిందట. అయినా ఇలా చెప్పుకోవడం మాములే కానీ సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్లతో నిరాశలో అభిమానులకు దీని సక్సెస్ కిక్ ఇస్తుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని దర్శకుడు ఓం రౌత్ ఎలా వాడాడోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆర్ఆర్ఆర్ తరహాలో దీన్ని కూడా గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ పదమూడున జరగబోయే ప్రీమియర్ల రిపోర్ట్ మీదే అందరి చూపు ఉంది
This post was last modified on May 4, 2023 4:41 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…