ఒకప్పుడు తెలుగులో కామెడీ సినిమాలు వెల్లువలా వచ్చేవి. కామెడీ సినిమాలు తీయడానికే చాలామంది దర్శకులు ఉండేవాళ్లు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు తిరుగులేని కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవాళ్లు. వీళ్ల వల్ల చాలామంది కామెడీ రైటర్లకు పని ఉండేది.
అలాగే మరే ఇండస్ట్రీలో లేని విధంగా రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఎప్పుడూ బిజీగా ఉంటుండేవాళ్లు. కానీ ఈ వైభవమంతా గత పది పదిహేనేళ్లలో కరిగిపోయింది. కామెడీ తీసే లెజెండరీ డైరెక్టర్లో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. నటీనటులు కూడా చాలామంది కాలం చేశారు. రచయితలు కనుమరుగయ్యారు. ఇప్పుడు తెలుగు సినిమాలు కామెడీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు కామెడీనే నమ్ముకుని సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేసుకుంటున్నాడు.
మీరెందుకు కామెడీ సినిమాలు చేయట్లేదు అని తన కొత్త చిత్రం ‘ఉగ్రం’ ప్రమోషన్ల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. అతను మారిన పరిస్థితులపై కుండబద్దలు కొట్టేలా మాట్లాడాడు. ‘‘ఇప్పుడు కామెడీ రాసేవాళ్లు ఎవరున్నారు? తీసేవాళ్లు ఎవరున్నారు? కామెడీ రాయడం చాలా కష్టం. ఎలాంటి ఇన్‌స్పిరేషన్ లేకుండా కొత్తగా కామెడీ రాయడం ఒక సవాల్.
అప్పట్లో మా నాన్న గారి దగ్గరే పదుల సంఖ్యలో రైటర్లు ఉండేవాళ్లు. అందరూ కలిసి ఒకే ప్రాజెక్టు చేసేవాళ్లు. అందరిలో మా పేరు వస్తే చాలు అనుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు పేరు తెచ్చకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా ఇప్పుడు చాలా లిమిటేషన్ల మధ్య పని చేయాల్సి వస్తోంది. ‘కితకితలు’ లాంటి సినిమాను ఇప్పుడు తీస్తే బాడీ షేమింగ్ అని గొడవ చేస్తారు. స్వచ్ఛమైన కామెడీతో కథలు రాయడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది’’ అని నరేష్ అన్నాడు.
This post was last modified on May 4, 2023 2:48 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…