Movie News

సూరి పడేశాడు.. మెహర్ లేపుతాడా?

టాలీవుడ్లో సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్‌ల్లో ఎవరు మంచి డైరెక్టర్ అంటే.. మరో మాట లేకుండా సురేందర్ రెడ్డి పేరే చెబుతారు. ఇద్దరి ట్రాక్ రికార్డును గమనిస్తే.. సురేందర్‌కు మెహర్ దరిదాపుల్లో కూడా నిలవడు. మెహర్ కెరీర్లో రీమేక్ మూవీ అయిన ‘బిల్లా’ మినహాయిస్తే అన్నీ డిజాస్టర్లే. కానీ సురేందర్ అతనొక్కడే, కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. ధృవ, సైరా కూడా బాగానే ఆడాయి. ఐతే భిన్న ధ్రువాల్లాంటి ఈ ఇద్దరు దర్శకులతోనూ సినిమాలు లైన్లో పెట్టాడు నిర్మాత అనిల్ సుంకర.

ముందుగా సురేందర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. ఏజెంట్. అక్కినేని అఖిల్‌కు పెద్దగా మార్కెట్ లేకపోయినా.. సురేందర్‌ను నమ్మి ఏకంగా రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ సినిమాను నిర్మించాడు. కానీ ఆయన చేసిన రిస్క్ దారుణమైన ఫలితాన్నిచ్చింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సూరిని నమ్మితే కొంప మునిగిందని ఇప్పుడు అనిల్ లబోదిబోమనే పరిస్థితి.

ఐతే మంచి ట్రాక్ రికార్డున్న సురేందర్ అనిల్‌కు ఇలాంటి చేదు అనుభవాన్ని మిగిలిస్తే.. బ్యాడ్ ట్రాక్ రికార్డున్న మెహర్‌ను ఇప్పుడు నమ్ముకోవాల్సి వస్తోంది. మెహర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్‌’కు కూడా అనిలే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. మెహర్ చివరి రెండు చిత్రాలు ‘షాడో’, ‘శక్తి’ భారీ డిజాస్టర్లు అయినా.. దాదాపు పదేళ్లుగా మెహర్ సినిమానే తీయకపోయినా.. అతణ్ని నమ్మి ‘భోళా శంకర్’ను అప్పగించాడు చిరు. కాకపోతే ఇది రీమేక్ మూవీ కావడం వల్ల మెహర్ తన క్రియేటివిటీతో ఏం చేసేస్తాడో అని కంగారు పడాల్సిన అవసరం లేదు.

చిరు ‘వాల్తేరు వీరయ్య’తో మంచి ఊపుమీదున్నాడు. ‘భోళా శంకర్’ సగటు మాస్ సినిమాలా ఉంటుందని ముందే అందరూ ఒక అంచనాతో ఉన్నారు కాబట్టి సడెన్ షాకులేమీ ఉండకపోవచ్చు. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. పెడుతున్న ఖర్చుతో పోలిస్తే మెరుగ్గానే బిజినెస్ అయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ‘ఏజెంట్’ చేసిన నష్టాన్ని అనిల్ ఈ సినిమాతో ఎంతమేర పూడ్చుకుంటాడో చూడాలి.

This post was last modified on May 4, 2023 2:47 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

28 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago