Movie News

సెలబ్రెటీల చావు.. ఇదేం పైశాచికత్వం?

సోషల్ మీడియా కాలంలో ఎవరు ముందు ఒక న్యూస్‌ను బ్రేక్ చేస్తారనే విషయంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఆ క్రెడిట్ కోసమని.. సోషల్ మీడియాలో జనాలు చూపించే అత్యుత్సాహం పుణ్యమా అని.. సెలబ్రెటీలు బతికుండగానే చంపేస్తున్నారు. గతంలో వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్.. ఇలా చాలామంది ప్రముఖులు తాము చావలేదని.

బతికే ఉన్నామని వీడియోలు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు సీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబీకులు ఇలాగే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. శరత్ బాబు కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవం. ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనది తీవ్ర అనారోగ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా నెటిజన్లు ఫేక్ న్యూస్‌లను ప్రచారంలోకి తేవడం విచారకరం.

శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎవరో ఒకరు న్యూస్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఎవరో ఊరూ పేరు లేని వాళ్లు ఇలా చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. దారుణమైన విషయం ఏంటంటే వెరిఫైడ్ హ్యాండిల్స్ నుంచి ఈ న్యూస్ బయటికి వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఎవరో చెప్పారని చావు వార్తను ఎలా బ్రేక్ చేస్తారన్నది అర్థం కాని విషయం. కొందరు తమ హ్యాండిల్స్‌కు రీచ్ పెరగాలని కావాలనే ఇలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.

కానీ ఎక్కువమంది ఫాలో అయ్యే వెరిఫైడ్ హ్యాండిల్స్ కొంచెం చూస్కుని, ఆచితూచి పోస్టులు పెట్టాల్సిన అవసరం ఉంది. శరత్ బాబు ప్రాణాలతోనే ఉన్నారని.. అనారోగ్యం నుంచి కొంచెం కోలుకోవడంతో ఐసీయూ నుంచి రూంకి షిఫ్ట్ కూడా చేశారని శరత్ బాబు సోదరి తాజాగా మీడియాక అప్‌డేట్ ఇచ్చారు. బతికున్న మనిషి చనిపోయారని మీడియాలో ప్రచారం జరిగితే.. అది ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించి వార్తలు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.

This post was last modified on May 4, 2023 2:47 pm

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

1 hour ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

1 hour ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

2 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

2 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

3 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

3 hours ago