ప్రేమకథా చిత్రాలకు సరైన లీడ్ పెయిర్ ఉండటం చాలా ముఖ్యం. మంచి వయసులో ఉండి.. అందం, ఆకర్షణ ఉన్న హీరో హీరోయిన్లయితే ప్రేమకథల్లో చూడ్డానికి బాగుంటారు. ఇక ఆ ఇద్దరిలో చలాకీ తనం ఉన్నట్లయితే ప్రేమకథ మరింత పండుతుంది. ఇప్పుడు అలాంటి జంటతోనే ఒక ప్రేమకథను రూపొందించబోతున్నాడు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.
మళ్ళీ రావా లాంటి మంచి ప్రేమకథతో దర్శకుడిగా పరిచయం అయిన గౌతమ్.. ఆ తర్వాత జెర్సీ లాంటి క్లాసిక్ తీశాడు. మూడో సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాల్సింది కానీ.. అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. దాని స్థానంలో విజయ్ దేవరకొండ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి శ్రీలీలను కథానాయికగా ఎంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రం బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ వేడుకలో విజయ్, శ్రీలీలలను చూసిన ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. విజయ్ అందం, ఆకర్షణ, తన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక పెర్ఫామెన్స్ అయితే ఇరగదీసేస్తాడు. అతణ్ని సరిగ్గా వాడుకోవడం ముఖ్యం.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. పెళ్ళిసందడి, ధమాకా చిత్రాలతో ఆమె టాలీవుడ్లో సూపర్ హాట్ హీరోయిన్ అయిపోయింది. తన చలాకీతనం, డ్యాన్సుల్లో చురుకుదనం కుర్రకారుకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తను ఒకరు. పెర్ఫామెన్స్ విషయంలోనూ తనకు ఢోకా లేదు. విజయ్ లాంటి ఎనర్జిటిక్ హీరో పక్కన శ్రీలీల లాంటి చలాకీ అమ్మాయిని చూడ్డం ప్రేక్షకులకు కనువిందే. ఈ జంటను సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే.. వారి కెమిస్ట్రీ వర్కవుట్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్లే. మరి ఏం చేస్తాడో చూడాలి గౌతమ్.
This post was last modified on May 4, 2023 12:11 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…