ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే తీశాడు యువ దర్శకుడు పరశురామ్. ఐతే అతడి చివరి సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి.. పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టడంతో అతడి రేంజ్ మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం సంపాదించాడు. ఈ సినిమా ఓ రేంజిలో ఉంటుందంటూ పరశురామ్ ఇంతకుముందు చేసిన ప్రకటన అభిమానుల్ని మురిపించింది.
కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అంటూ సినిమా పేరు కూడా ప్రకటించారు. ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు చిత్ర బృందం ఏం విశేషం పంచుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ రోజు టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
స్వయంగా దర్శకుడు పరశురామే ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒక ట్విట్టర్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ పోస్టు కనిపిస్తున్న అకౌంట్ ఫేక్. పరశురామ్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి తరచుగా పోస్టులో పెడుతున్నారు.
మహేష్ సినిమా దర్శకుడు అని అతడి ఫ్యాన్స్ ఈ అకౌంట్‌ను ఫాలో అయిపోతున్నారు. అందులో వచ్చే అప్ డేట్లను నమ్మేస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు కోసం తమన్ సినిమా టైటిల్ ట్రాక్ రెడీ చేసేశాడని నమ్మేస్తున్నారు. కానీ ఆ రోజు ఏదో ఒక విశేషం పంచుకోవడం వాస్తవమే కానీ.. ఈ ట్వీట్ నమ్మి టైటిల్ ట్రాకే రిలీజ్ చేస్తారనుకుంటే పొరబాటే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.
This post was last modified on August 5, 2020 2:22 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…