దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో దగ్గుబాటి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కి ఆలస్యం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫస్ట్ కాపీ ను దర్శకుడు తేజ నిర్మాతలు జెమిని కిరణ్ కి అలాగే సురేష్ బాబు కి అప్పగించేసి తన నెక్స్ట్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయాడు. సినిమా రిలీజ్ ఎప్పుడనేది తేజకి కూడా తెలియని పరిస్థితి. తాజాగా గోపీచంద్ తో చేసిన ఇంటర్వ్యూ లో తేజకి అహింస రిలీజ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి తేజ చెప్పిన ఆన్సర్ ఎదురుగా ఉన్న గోపీచంద్ కి కూడా నవ్వు తెప్పించింది.
సినిమాకి సురేష్ బాబునే నిర్మాత కదా, రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతుంది ? అంటూ గోపీచంద్ అడిగిన ప్రశ్నకి తేజ దీనికి సురేష్ బాబు , జెమిని కిరణ్ ఇద్దరు నిర్మాతలు. రెండు ఐరావతాలకు మనం ఏం చెప్తాం ? అని కామెంట్ చేశారు. ఇక నిర్మాతగా జెమిని కిరణ్ పేరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుక సురేష్ బాబు కూడా ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం ఎందుకో ? సురేష్ బాబు ఏం ప్లాన్ చేస్తున్నారో ? ఆయనకే తెలియాలి.
This post was last modified on May 3, 2023 1:23 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…