ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తన పాన్ ఇండియా భారీ లైనప్ లో మారుతికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఎనౌన్స్ మెంట్ ,ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టేసి మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశారు. ఈ సినిమాలో డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ తరహా పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. కేరెక్టర్ , డైలాగ్స్ అన్నీ అదే తరహాలో ఒక్కప్పటి ప్రభాస్ ను గుర్తుచేసేలా ఉండబోతున్నాయి.
అయితే ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ ఇవ్వకుండా షూటింగ్ చేసేస్తున్న టీంకి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాకిడి ఎదురవుతూనే ఉంది. కానీ వాటిని పట్టించుకోకుండా ఓ ప్రాపర్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే ఈ సినిమా గురించి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా మొదలు కాకముందే మారుతితో ప్రభాస్ అనే న్యూస్ బయటికి వచ్చేసింది. ఆ క్షణం నుండి ఈ కాంబో మీద ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ, నిస్పృహ వ్యక్తం చేశారు. మారుతితో సినిమా వద్దని ఫ్యాన్స్ ట్విటర్ లో ట్రెండ్ చేసే వరకూ వెళ్లింది. దాంతో మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఫ్యాన్స్ సంతోష పెట్టే అప్ డేట్ తో సినిమా సంగతి చెప్పాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ , మారుతి కాంబో మూవీ థియేటర్స్ లోకి రానుంది. అప్పటి వరకు ఇలా సైలెంట్ గా ఒక్కో షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంటూ రెడీ చేస్తారు.
This post was last modified on May 3, 2023 6:16 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…