సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడని చెప్పలేం కానీ.. అతడికంటూ ఒక స్థాయి ఉంది. తొలి సినిమా అతనొక్కడే మొదలుకుని.. కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్‌బస్టర్లు.. ధృవ, సైరా లాంటి డీసెంట్ మూవీస్‌తో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
తన కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు. అశోక్, అతిథి, ఊసరవెల్లి అనుకున్నంతగా ఆడలేదు. కిక్-2 అయితే డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమాలేవీ చేయని డ్యామేజ్ అతడికి ఏజెంట్ మూవీ చేసింది. సురేందర్ నుంచి ఇంత పేలవమైన సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమాను మొదలుపెట్టినట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పడంతో ఇప్పుడు మొత్తం నిందంతా సురేందరే మోయాల్సి వస్తోంది. ఇది అతడికి మామూలు డ్యామేజ్ కాదు. ఐతే ఏజెంట్ మూవీతో కేవలం పేరే కాదు.. డబ్బులూ పోగొట్టుకున్నాడు సురేందర్.
ఏజెంట్ మూవీకి సురేందర్ దర్శకుడే కాదు.. నిర్మాత కూడా. సరెండర్ టు సినిమా పేరుతో కొత్త బేనర్ పెట్టి ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారాడతను. ఐతే ఈ సినిమా కోసం అతను ప్రత్యేకంగా డబ్బులేం పెట్టలేదు. దర్శకులు ఇలా బేనర్ పెట్టి తమ రెమ్యూనరేషన్‌నే పెట్టుబడిగా పెట్టడం ఇప్పుడు ట్రెండ్.
సినిమా బాగా ఆడి మంచి లాభాలు వస్తే వాటా తీసుకుంటారు. ఇలాంటపుడు సినిమా హిట్ అయితే పారితోషకాన్ని మించి రెవెన్యూ వస్తుంది. కానీ తేడా కొడితే అంతే సంగతులు. సురేందర్ విషయంలో రెండోదే జరిగింది. రూ.80 కోట్ల బడ్జెట్లో (నిర్మాతల ప్రకారం) తెరకెక్కిన సినిమా థియేటర్ల నుంచి రూ.10 కోట్ల షేర్ కూడా రాబట్టలేని పరిస్థితి. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కలిపినా ఓవరాల్‌గా పెట్టుబడిలో సగం కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఆల్రెడీ డెఫిషిట్‌లో సినిమాను రిలీజ్ చేసి కూడా.. బయ్యర్లకు ఇప్ఉపడు సెటిల్ చేయాల్సిన స్థితిలో ఉన్నాడు అనిల్. ఇక దర్శకుడికి ఏమిస్తాడు? అంటే సురేందర్‌కు ఈ సినిమా వల్ల ఆర్థికంగా ఏమీ మిగలకపోవచ్చు. అంటే పేరుతో పాటు డబ్బులూ పోగొట్టుకున్నాడన్నమాట సూరి.
This post was last modified on May 3, 2023 1:04 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…