గత ఏడాది పొన్నియన్ సెల్వన్-2 రిలీజైనపుడు తెలుగులో బాగా డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం సినిమాను ఆహా ఓహో అన్నారు. తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. అసలు కథే అర్థం కాకపోవడం.. మన ప్రేక్షకులు ఆశించే బాహుబలి తరహా గూస్ బంప్స్ మూమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది.
మొత్తంగా తెలుగు బాక్సాపీస్ దగ్గర ఈ చిత్రానికి నిరాశాజనక ఫలితం తప్పలేదు. ఐతే థియేటర్ల నుంచి వెళ్లిపోయాక ఓటీటీలో చూసిన జనాలు.. సినిమా పర్లేదని అన్నారు. మరీ అంత తీసిపడేయదగ్గ చిత్రం కాదన్నారు. మరోవైపు తమిళనాట మాత్రం ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టింది. తమిళ సినీ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. రెండో భాగం విషయానికి వస్తే తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది. తమిళంలో మాత్రం హైప్ తక్కువగా లేదు.
ఐతే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే రెండో భాగానికి తెలుగులో మంచి టాకే వచ్చింది. తొలి భాగం చూశాక ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంలో ప్రేక్షకులు ఒక అంచనాతో ఉన్నారు. కథ పరంగా కొంచెం క్లారిటీ వచ్చింది. సినిమాలో కూడా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఐతే ఈ టాక్‌కు తగ్గట్లు వసూళ్లు లేకపోవడమే ఆశ్చర్యకరం. ఫస్ట్ పార్ట్ కంటే కూడా తక్కువ వసూళ్లే రాబడుతోందీ సినిమా. తొలి వీకెండ్లో 5 కోట్లకు అటు ఇటుగా షేర్ వచ్చింది. వీకెండ్ తర్వాత సినిమా డల్లయింది.
ఐతే తెలుగు వెర్షన్ మీద పెద్ద అంచనాలు లేవు కాబట్టి ఓకే కానీ.. ఫస్ట్ పార్ట్‌ను నెత్తిన పెట్టుకున్న తమిళ ప్రేక్షకులు కూడా సెకండ్ పార్ట్‌ను అనుకున్నంత స్థాయిలో ఆదరించట్లేదు. పీఎస్-1 టికెట్ల కోసం ఎగబడ్డట్లు దీని కోసం ఎగబడట్లేదు. ఆక్యుపెన్సీలు మరీ గొప్పగా ఏమీ లేవు. బాహుబలి-1 బ్లాక్ బస్టర్ అయ్యాక రెండో భాగానికి దేశవ్యాప్తంగా ఎలాంటి యుఫోరియా నెలకొందో చూశాం. కానీ తమిళం వరకు పీఎస్-2 అలాంటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయింది. వసూళ్లు కూడా ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే తక్కువే వస్తున్నాయి. మరి సమస్య ఎక్కడుందో?
This post was last modified on May 3, 2023 1:02 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…