sakshi Vaidya
కొన్నిసార్లు ఒక హీరోయిన్ యావరేజ్‌గా ఉన్నా, తనకు నటన అంతగా రాకపోయినా.. ఆమె తొలి చిత్రం సూపర్ హిట్ అయితే.. ఆ తర్వాత కూడా కొన్ని విజయాలు దక్కితే ఆమె మీద లక్కీ గర్ల్ అని ముద్ర పడిపోతుంది. అవకాశాలు వరుస కట్టేస్తాయి. చూస్తుండగానే పెద్ద హీరోయిన్ అయిపోతుంది.
అదే సమయంలో కొందరు హీరోయిన్లకు అందం, అభినయం రెండూ ఉన్నా.. సక్సెస్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోతారు. వాళ్ల సినిమాలు తేడా కొట్టినపుడు కనుమరుగైపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటారు. మరి కొన్ని రోజుల కిందటే తెలుగు తెరపై తళుక్కుమన్న ముంబయి భామ సాక్షి వైద్య ఏ కోవకు చెందుతుందన్నది ఆసక్తికరం. ‘ఏజెంట్’ సినిమాతో ఈ అమ్మాయి టాలీవుడ్లో హీరోయిన్‌గా అడుగు పెట్టింది.
సాక్షిని ‘ఏజెంట్’ పోస్టర్లు, ఇతర ప్రోమోల్లో చూసినపుడే భలే ఉందే అనుకున్నారు ప్రేక్షకులు. యూత్‌ను ఆమె లుక్స్ బాగానే ఆకట్టుకున్నాయి. ఐతే మంచి అంచనాల మధ్య రిలీజైన ‘ఏజెంట్’.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ కెరీర్ గురించి.. నిర్మాతకు వచ్చిన నష్టం గురించి.. సురేందర్ రెడ్డి చేసిన తప్పులు, తన భవిష్యత్ గురించి అందరూ మాట్లాడుతున్నారే కానీ.. సాక్షి గురించి చర్చే లేదు.
వేరే విషయాలు చాలా పెద్దవిగా కనిపిస్తుండటం వల్ల సాక్షి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. నిజానికి సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. యాక్టింగ్ కూడా పర్వాలేదు. కొన్ని చోట్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకుంది. ఒక డ్యూయెట్లో తనలోని గ్లామర్ కోణాన్ని కూడా చూపించింది. కానీ సినిమా తేడా కొట్టడంతో ఇవన్నీ కూడా వృథా అయిపోయాయి. తొలి సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అయ్యాక సాక్షిని టాలీవుడ్ దర్శక నిర్మాతలు పట్టించుకుంటారా లేక.. రిజల్ట్ పక్కన పెట్టి ఈ చార్మింగ్ బ్యూటీకి కొత్తగా అవకాశాలు ఇస్తారా అన్నది చూడాలి.
This post was last modified on May 3, 2023 1:01 pm
ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…
రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…
2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…
తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్,…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…