సినిమా హీరోలు కనబడితే వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు సామాన్య జనాలు ఎగబడటం సాధారణం. ఐతే ఆ హీరోలు ఎలాంటి మూడ్‌లో ఉన్నారు.. మనం వారిని ఎక్కడ కలిశాం.. వారి ప్రైవసీ సంగతేంటి.. ఇలాంటివన్నీ కొంచెం చూస్కోవాలి. ఫొటోలు, సెల్ఫీలు దిగేటపుడు కనీసం అనుమతి అడగాలి.
అలా కాకుండా మన కోణంలో మనం ఆలోచిస్తూ దూసుకెళ్లిపోతే ఇబ్బందులు తప్పవు. ముంబయి ఎయిర్‌పోర్టులో షారుఖ్ ఖాన్‌తో్ సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిన ఒక అభిమానికి ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్ట్ నుంచి తన మేనేజర్ పూజా దడ్లానితో కలిసి బయటికి వస్తుండగా.. ఆయన్ని మీడియా వాళ్లతో పాటు అభిమానులు చుట్టుముట్టారు. ఐతే షారుఖ్ నడిచి వస్తుండగా.. ఒక ఫ్యాన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.
సెల్ఫీకి పోజ్ ఇవ్వమని కనీసం షారుఖ్‌ను అడక్కుండానే.. పక్కన నడుస్తూ మొబైల్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఇది షారుఖ్‌కు చికాకు తెప్పించింది. వెంటనే చేత్లో ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడం.. వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అభిమానితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించాడంటూ కొందరు ఆయన్ని విమర్శిస్తుంటే.. కనీసం సెల్ఫీ కోసం పర్మిషన్ కూడా అడక్కుండా ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
అభిమానిని నెట్టేసే దృశ్యం మాత్రమే చూస్తే.. షారుఖ్ కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు అనిపించినా.. మొత్తం వీడియో చూస్తే మాత్రం అభిమానిదే తప్పు అని అర్థమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చిరాకు పుట్టి స్టార్లు ఫోన్లు విసిరేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వాళ్లతో పోలిస్తే షారుఖ్ కాస్త బెటర్‌గానే రియాక్టయినట్లే.
This post was last modified on May 3, 2023 12:55 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…