తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజులల తనయురాలైన వనిత ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.
ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి పెళ్లి ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఐతే తర్వాత ఇద్దరూ గొడవ పడి విడిపోయారు. కాగా ఇటీవలే పీటర్ పాల్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా వనిత ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది. ఐతే మీడియాలో అందరూ పీటర్‌ను వనిత మూడో భర్తగా పేర్కొన్నారు. ఇది వనితకు రుచించకపోవడం ఆశ్చర్యకరం. పీటర్ తన భర్త కాదని ఆమె తేల్చిచెప్పింది. మీడియా తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో ఓపిక పట్టాను. నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు. కానీ అన్ని మీడియా సంస్థలపై ఉన్న గౌరవంతో ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నానని, పీటర్ పాల్‌తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదు.. 2020లో కొన్ని రోజులపాటు మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అది కూడా ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయన భార్యని కాదు. అతను నా భర్త కాదు. వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలు ఆపేయాలి. ఇప్పుడు నాకు భర్త లేడు. ఒంటరిగానే ఉంటున్నాను ఏ విషయానికి నేను బాధపడటం లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందరికి ఇదే నా విన్నపం అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది వనిత.
తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 3, 2023 2:44 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…