టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో ఎక్కువ అంచనాలున్న వాటిలో సలార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ కోసం ఆదిపురుష్ కన్నా ఎక్కువగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాట వాస్తవం. అయితే అప్ డేట్స్ విషయంలో హోంబాలే ఫిలింస్ పక్కా ప్రీ ప్లానింగ్ తో లీక్స్ పెద్దగా బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. అసలు ఇది రెండు భాగాలా సింగిల్ పార్టా అనేది కూడా తెలియడం లేదు. ఇవాళ రామబాణం ప్రమోషన్స్ సందర్భంగా జగపతిబాబుని ఈ విషయమే మీడియా అడిగే ప్రయత్నం చేసింది.
విచిత్రంగా జగ్గు భాయ్ చెప్పిన సంగతి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఇప్పటిదాకా ఆయన కేవలం అయిదు రోజులు మాత్రమే సలార్ షూటింగ్ లో పాల్గొన్నారట. ప్రశాంత్ నీల్ లాంటి ప్యాషన్ ఉన్న దర్శకులను తాను ఏమీ అడిగనని నేరుగా సెట్స్ కి వెళ్ళిపోయి ఆ ఎగ్జైట్ మెంట్ ని ఆస్వాదిస్తానని చెప్పారు. పట్టుమని వారం రోజులు కూడా వెళ్ళలేదంటే ఇంకా చిత్రీకరణ చాలా బాలన్స్ ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇందులో మెయిన్ విలన్ జగపతి బాబే. రెండో ప్రతినాయకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ కథలో తండ్రికొడుకలనే ప్రచారం ఆల్రెడీ ఉంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం జగపతిబాబు పాత్ర సలార్ 2లోనే ఎక్కువ ఉంటుందట. అచ్చం బాహుబలి తరహాలో ఫస్ట్ పార్ట్ మొత్తం కొడుకు ట్రాక్ ని చూపించి సీక్వెల్ లో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి సీక్వెల్ లో అసలు సలార్ ఎవరు, అతనేం చేశాడు, ఏమయ్యాడు అనే లైన్ మీద చాలా డిఫరెంట్ గా సాగుతుందట. మరి ఇద్దరు ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తారా లేక ఒకరు చనిపోయి ఇంకొకరితో రివెంజ్ డ్రామా ప్లాన్ చేశారానేది వేచి చూడాలి. మొత్తానికి సలార్ పబ్లిసిటీ ప్రారంభం కాకుండానే దానికి సంబంధించిన విషయాలు షాకింగ్ గా ఉంటున్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది
This post was last modified on May 3, 2023 12:25 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…