బాలీవుడ్లో సినిమా జంటలు ఒక్కటి కావడం కొత్తేమీ కాదు. ఐతే సినిమా వాళ్లు కాకుండా హీరోయిన్ల చూపు వ్యాపారవేత్తలు, ఆ తర్వాత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. నవనీత్ కౌర్ లాంటి వాళ్లు రాజకీయ నేతల్ని పెళ్లాడి వాళ్లు కూడా రాజకీయాల్లోకి వచ్చేయడం గమనించవచ్చు.
ఇప్పుడు మరో బాలీవుడ్ కథానాయిక రాజకీయ నాయకుడితో పెళ్లికి రెడీ అయిపోయింది. ఆమే.. పరిణీతి చోప్రా. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ముంబయిలో ఈ జంట మీడియా కెమెరాలకు చిక్కుతూనే ఉంది. ఆల్రెడీ వీళ్ల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని గతంలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. అతి త్వరలోనే పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థః చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు ఇందుకు ముహూర్తం కూడా చూశాయి. ఎంగేజ్మెంట్ రోజే ఈ జంట ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఐతే నిశ్చితార్థం ఇప్పుడే జరిగినా పెళ్లికి మాత్రం తొందరపడట్లేదట ఈ జంట. ఈ ఏడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది ఆ వేడుక ఉండొచ్చు.
గతంలో పరిణీతి, రాఘవ్ రహస్యంగానే కలుసుకునే వారు కానీ కొన్ని నెలల నుంచి తమ బహిరంగంగానే తిరుగుతున్నారు. కెమెరాలకు దొరికేస్తున్నారు. లేడీస్ వెర్సస్ రిక్కీ బాల్ సినిమాతో కథానాయికగా పరిణీతి చోప్రా.. ఇప్పటిదాకా పాతిక సినిమాల దాకా చేసింది. ప్రస్తుతం ఆమె ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో చంకీలా సినిమా చేస్తోంది. పంజాబీ నటుడు దిల్జీత్ దోసాంజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. పెళ్లి తర్వాత కూడా పరిణీతి సినిమాల్లోనే కొనసాగుతుందట.
This post was last modified on May 2, 2023 10:43 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…