Movie News

కెజిఎఫ్ నేపథ్యంలో ధనుష్ సినిమా

శాండల్ వుడ్ స్థాయిని ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్లిన కెజిఎఫ్ రెండు భాగాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయట అంతగా గుర్తింపు లేని యష్ ని ఒక్క దెబ్బతో ఫ్యాన్ ఇండియా హీరోని చేసింది. ఇందులో వాడిన కోలార్ గోల్డ్ మైన్స్ వెనుక ఎంత చరిత్ర ఉందో ఇది చూశాకే అర్థమయ్యింది. అయితే ప్రశాంత్ నీల్ చూపించింది కేవలం సాంపిల్ మాత్రమే. ఆ బ్యాక్ డ్రాప్ ని తీసుకుని రాఖీ భాయ్ అనే గ్యాంగ్ స్టర్ ప్రభుత్వాలను మాఫియాని ఎంతగా వణికించాడో తెరమీద ఆవిష్కరించాడు. ఇదంతా కల్పిత కథే. నిజంగా జరిగిన సంఘటనలు కాదు.

తవ్వి తీస్తే కోలార్ బంగారు గనుల్లో ఎన్నో అద్భుతమైన స్టోరీలు దాగున్నాయి. వాటిని వెలికి తీసే పనిలో దర్శకుడు వెట్రిమారన్ ఉన్నట్టు చెన్నై అప్ డేట్. ధనుష్ హీరోగా వడ చెన్నై 2 ని ప్లాన్ చేసుకున్న మారన్ కానీ ఆ ఐడియాని తాత్కాలికంగా పక్కనపెట్టి దాని స్థానంలో కొత్త స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. వినడానికి కెజిఎఫ్ తరహాలోనే అనిపించినప్పటికీ పూర్తిగా డిఫరెంట్ ప్రెజెంటేషన్ తో కోలార్ లో జరిగిన అన్యాయాలు అక్రమాలు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారట. దీనికి సంబంధించిన హోమ్ వర్క్ ని అప్పటి న్యూస్ పేపర్లు పుస్తకాలు తిరగేయడం ద్వారా రాసుకున్నారు.

అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆ మధ్య కబ్జా ఇచ్చిన డైరెక్టర్ చంద్రు మిగిలినవాళ్లను భయపెట్టినంత పని చేశాడు. కానీ వెట్రిమారన్ తో ఆ టెన్షన్ అక్కర్లేదు. విసరనై నుంచి విడుతలై దాకా ఏనాడూ ఆయన నిరాశ పరిచిన దాఖలాలు లేవు. కాకపోతే తమిళులకు నచ్చినంతగా ఇతర రాష్ట్రాల వాళ్లకు అవి కనెక్ట్ కాలేదు. ఈసారి అలా జరగకుండా అన్ని భాషల్లో నచ్చేలా దీన్ని సెట్ చేసుకునే అవకాశాలున్నాయి. కథ మారినా వడ చెన్నై 2 టైటిల్ పెట్టినా ఆశ్చర్యం లేదని ఇన్ సైడ్ టాక్. వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

This post was last modified on May 2, 2023 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలా అయితే ఎలా జగన్?

వైసీపీకి ద‌శ‌-దిశ కొర‌వ‌డిందా? అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం…

4 mins ago

కన్నప్ప వస్తున్నాడు…కానీ రిస్క్ ఉంది

మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…

26 mins ago

రోజా.. కౌంటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…

35 mins ago

దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు ఎన్నంటే?

ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…

2 hours ago

వీకెండ్ అందాలతో వెలిసిపోతున్న బేబమ్మ!

2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్‌ సింగరాయ్‌,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…

2 hours ago

ఇక‌, ‘అదానీ పార్ల‌మెంటు’.. నేటి నుంచి స‌మావేశాలు!

భార‌త పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల్లోనే వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు స‌హా..…

3 hours ago