Movie News

నిజంగా ‘జైలర్’తో పెట్టుకుంటారా?

సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా టార్గెట్ చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయనేమీ వైసీపీని కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి రాజకీయ విమర్శలూ చేయలేదు. కేవలం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడారనే ఒకే కారణంతో వైసీపీ శ్రేణులు ఆయన్ని దారుణంగా టార్గెట్ చేశాయి.

చీకేసిన టెంక ముఖం.. 3 రోజులు షూటింగ్ చేస్తే 4 రోజులు ఆసుపత్రిలో ఉంటాడు.. ఇలాంటి మాటలు రజినీ గురించి మాట్లాడ్డం వైసీపీలో అయినా అందరికీ రుచిస్తాయా అన్నది సందేహం. ఈ వ్యాఖ్యల పుణ్యమా అని.. వైసీపీ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తెలుగు వాళ్లే కాక తమిళులు కూడా తోడై వైసీపీని విపరీతంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. నాలుగు రోజుల ముందు మొదలైన ఈ చిచ్చు ఇంకా కూడా చల్లారలేదు. తమిళ జనాలు జగన్‌, వైసీపీ గాలి తీస్తూ పోస్టులు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రజినీని వైసీపీ ఇంతటితో వదలదు అని.. ఆయన కొత్త సినిమా ‘జైలర్’ రిలీజైనపుడు చుక్కలు చూపించడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. లేదా ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా.. ఎలా టార్గెట్ చేస్తారో కొన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో తెలిసిందే. అలాగే టికెట్ల రేట్ల గురించి ఏవో వ్యాఖ్యలు చేశాడని నాని సినిమాను సైతం టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును పొగిడాడని ‘జైలర్‌’కు ఇబ్బందులు సృష్టిస్తారనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి ఎదురు లేనపుడు ఇలాంటివి ఏం చేసినా చెల్లింది కానీ.. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న సమయంలో ఇలా చేస్తే అది బూమరాంగ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే రజినీ విషయంలో వైసీపీకి చాలా డ్యామేజ్ అయింది. తటస్థులు ఈ విషయంలో వైసీపీని తూర్పారబడుతున్నారు. ఇక రజినీ సినిమాను కూడా టార్గెట్ చేశారంటే జాతీయ స్థాయిలో అది మరింత పెద్ద చర్చకు దారి తీసి వైసీపీ పరువు పోవడం.. ఆ పార్టీకి చెప్పలేనంత డ్యామేజీ జరగడం ఖాయం.

This post was last modified on May 2, 2023 6:50 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago