స్టార్ హీరో సినిమా చేతిలో పడగానే సరిపోదు. అది జనంలోకి బలంగా రిజిస్టర్ అయ్యేలా మీడియాలో దాని గురించి క్రమం తప్పకుండా చర్చ జరిగేలా ఏదో ఒకటి చేయాలి. ఎంత పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో చేస్తున్నా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈ విషయంలో హరీష్, సుజిత్ లు ఒకరికతో మరొకరు పోటీ పడుతూ మిగిలినవారికి స్ఫూర్తినిస్తున్నారు. వీళ్లిద్దరి రెగ్యులర్ షూటింగులు ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. పవన్ గ్యాప్ లేకుండా ఒకరితర్వాత మరొకరికి పక్కా ప్లాన్ ప్రకారం డేట్లు ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.
ఇందులో విశేషం లేదు కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఎప్పటికప్పుడు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం, అప్ డేట్లు ఇవ్వడం, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ప్రాంతాల గురించి లీక్స్ వదలడం, హీరో లుక్ దాచకుండా ఎవరైనా ఫోటోలు దిగితే అభ్యంతర చెప్పకపోవడాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. వీటి వల్ల సోషల్ మీడియాలో బజ్ పెరుగుతున్న మాట వాస్తవం. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అనే నెగటివ్ ఫ్యాక్టర్ ని అభిమానుల మనసులో నుంచి తుడిచేయడానికి హరీష్ చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి.
ఇక సుజిత్ ఓజి ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా అనే భరోసా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. వీటితో పోల్చుకుంటే పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు బాగా వెనుక బడి ఉంది. దర్శకుడు క్రిష్ ట్రెండీగా ఆలోచించకపోవడం మైనస్ గా నిలుస్తోంది. ఇంత పెద్ద గ్రాండియర్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంత ఫోకస్ పబ్లిసిటీ మీద పెట్టాలి. షూటింగ్ కి బ్రేక్ పడినా సరే ఏదో ఒక సమాచారం బయటికి వదులుతూ ఉండాలి. ఇప్పుడు దీనికన్నా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల మీద ఎక్కువ హైప్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి అక్కర్లేదు.
This post was last modified on May 2, 2023 3:17 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…