గత శుక్రవారం రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో అఖిల్-సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ‘ఏజెంట్’ మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియన్ సెల్వన్’ తొలి భాగం ఆశించినంత మంచి ఫలితం అందుకోలేకపోయినప్పటికీ.. రెండో భాగం పట్ల ఓ మోస్తరుగా ఆసక్తి నెలకొంది. ఈ రెండు చిత్రాల్లో ‘ఏజెంట్’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ‘పొన్నియన్ సెల్వన్-2’ ఉన్నంతలో మంచి టాకే అందుకుంది.
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఇది బెటర్ అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమైంది. ఇక వసూళ్ల పరంగా చూస్తే ‘ఏజెంట్’కు చేదు అనుభవం తప్పలేదు. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోెజు వసూళ్లు పర్వాలేదు కానీ.. తర్వాతి రోజు నుంచి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. వీకెండ్లోనే సినిమా సరిగా పెర్ఫామ్ చేయలేకపోయింది. ఆదివారం నాడు ఈ సినిమా మినిమం ఆక్యుపెన్సీలు లేక ఇబ్బంది పడటం గమనార్హం. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఆదివారం నాడు కేవలం రూ.43 లక్షల షేర్‌కు పరిమితం అయింది. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు మూడో రోజు రూ.43 లక్షల షేర్ అంటే అసలు కన్సిడర్ చేయలేని ఫిగరే.
దీంతో పోలిస్తే పొన్నియన్ సెల్వన్-2 ఆదివారం మెరుగైన వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం మూడో రోజు తెలుగులో రూ.1.40 కోట్ల షేర్ రాబట్టింది. ఐతే మామూలుగా చూస్తే ఇది కూడా పెద్ద ఫిగరేమీ కాదు కానీ.. ‘ఏజెంట్’తో పోలిస్తే ఆ సినిమా బాగా ఆడినట్లే. విశేషం ఏంటంటే.. ఈ రెండు కొత్త చిత్రాలతో పోలిస్తే గత వారం విడుదలైన ‘విరూపాక్ష’ ఆదివారం నాడు బెటర్‌గా పెర్ఫామ్ చేసింది బాక్సాఫీస్‌లో.
ఈ చిత్రం ఆదివారం రూ.2.38 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. అంటే ఏజెంట్, పొన్నియన్ సెల్వన్-2 కలిపి ఆదివారం నాడు రూ.1.73 కోట్ల షేర్ రాబడితే.. విరూపాక్ష ఒక్కటే అతకంటే రూ.65 లక్షలు ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. దీన్ని బట్టి కొత్త చిత్రాల కంటే పాత సినిమా పట్లే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్నది స్పష్టం. ఈ వీకెండ్ వరకు ‘విరూపాక్ష’ హవా కొనసాగడం ఖాయం. ఈ వారం రిలీజ్ కానున్న రామబాణం, ఉగ్రం సినిమా ఫలితాలతను బట్టి ఈ చిత్రం మూడో వీకెండ్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆధారపడి ఉంది.
This post was last modified on May 2, 2023 7:09 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…