Movie News

నంది అవార్డుల‌పై అశ్వినీద‌త్ వెర్స‌స్ పోసాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయం సినిమా రంగు పులుముకుని రంజుగా మారుతోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడును త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పొగ‌డ్డంపై వైసీపీ శ్రేణులు ఎంత తీవ్రంగా స్పందించాయో తెలిసిందే. అందుకు బ‌దులుగా టీడీపీ వాళ్ల‌తో పాటు న్యూట్ర‌ల్ జ‌నాలు కూడా వైసీపీ తీరును తూర్పార ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నంది అవార్డులు కుల ప్రాతిప‌దిక‌న ఇచ్చేవారంటూ వైసీపీ మ‌ద్ద‌తుదారు అయిన పోసాని కృష్ణ‌ముర‌ళి కొన్ని రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల‌కు తెలుగుదేశం స‌పోర్ట‌ర్ అయిన సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ ఘాటుగా బ‌దులిచ్చారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న మైల్ స్టోన్ మూవీ మోస‌గాళ్లకు మోస‌గాడు సినిమా రీరిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో ద‌త్‌కు నంది అవార్డుల గురించి ప్ర‌శ్న ఎదురైంది.

దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. ”ఇప్పుడేంటంటే ప్ర‌స్తుతం న‌డుస్తున్న సీజ‌న్ వేరు క‌దా. ఉత్త‌మ గూండా, ఉత్త‌మ రౌడీ ఆళ్ల‌కిస్తారు. సినిమాల‌కు ఇచ్చే రోజులు మ‌ళ్లీ రెండు మూడేళ్ల‌లో వ‌స్తాయి. అప్పుడు ఘ‌నంగా ఇస్తారు. మ‌నంద‌రికీ అవార్డులు వ‌స్తాయి” అనిఅశ్వినీద‌త్ వ్యాఖ్యానించారు. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారును ఉద్దేశించే ద‌త్ ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కాగా ద‌త్ ఈ వ్యాఖ్య‌లు చేసిన కాసేప‌టికే పోసాని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ద‌త్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ర‌జినీకాంత్ ప్ర‌స్తావ‌న కూడా తెచ్చారు.

”ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్ ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి. ఉత్తమ వేదవలు ఉత్తన సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి. రజనీకాంత్ రోజు చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగుడు కొమ్మను మాకు అభ్యంతరం లేదు. అతను చెన్నై లో సూపర్ స్టార్ తెలుగు వాళ్లకు కాదు. మాకు సూపర్ స్టార్ వున్నారు ఆయనే చిరంజీవి. ఆయ‌న‌కు జగన్ గారు అంటే ఎంతో ప్రేమ అలాగే చిరంజీవి అంటే అన్న అన్న అంటు వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు జగన్ గారు” అని పోసాని పేర్కొన్నారు.

This post was last modified on May 2, 2023 7:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago