టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారిన ఏజెంట్ డిజాస్టర్ గురించి నిర్మాత అనిల్ సుంకర నాలుగో రోజే ఓపెనయ్యారు. ఒక సుదీర్ఘమైన ట్వీట్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించి తెరమీద కంటే ఆన్ లైన్లోనే పెద్ద ట్విస్టు ఇచ్చారు. అందులో బాగా హైలైట్ అవుతున్న పాయింట్ సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టామని, మధ్యలో కరోనా లాంటి ఇతర కారణాలు ప్రభావితం చేయడం వల్ల ఎంతో ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇకపై ఇలా జరగకుండా ఖచ్చితమైన ప్లానింగ్ తో ముందుకెళ్తామని ఎలాంటి సాకులు వెతకడం లేదని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు.
ఇది అభిమానుల మధ్యే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒక అగ్ర నిర్మాత సినిమా నాలుగో రోజు ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇలా బహిరంగంగా తప్పుని ఒప్పేసుకోవడంలో నిజాయితీ కనిపిస్తున్నా ఫైనల్ రన్ అవ్వకుండానే ఇలా చేయడం వల్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పాఠం నేర్చుకున్నామని చెప్పిన అనిల్ సుంకర ఇలాంటి పొరపాట్లు ఇకపై చేయమని ఏజెంట్ ని తన నిర్మాణ సంస్థని నమ్ముకున్న వాళ్ళందరూ క్షమించాలని కోరుకున్నారు. నష్టాల భర్తీకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మరింత కష్టపడతామని క్లారిటీ ఇచ్చారు
అంతా బాగానే ఉంది కానీ స్క్రిప్ట్ మీద అనుమానాలు ఉన్నప్పుడు షూటింగ్ వాయిదా వేయడమో లేదా వేరే కథను ఎంచుకోవడమో చెయాలి కానీ ఇలా ఎనభై కోట్ల పెట్టుబడిని రిస్క్ లో పెట్టడం వల్ల ఇప్పుడు బయ్యర్లు నష్టపోయారు. అఖిల్ ఇమేజూ దెబ్బతినే ప్రమాదం తలెత్తింది. ఒకవేళ దర్శకుడు సురేందర్ రెడ్డి భరోసా ఇచ్చి ఉంటే ఇంత అనుభవమున్న ప్రొడ్యూసర్ గా కథని సీరియస్ గా జడ్జ్ చేయాల్సింది. ఏది ఏమైనా డ్యామేజ్ జరిగిపోయింది. అఖిల్ శారీరక కష్టం, మమ్ముట్టి లాంటి స్టార్ల పాత్రలు, భారీ బడ్జెట్ అన్నీ కర్పూరమయ్యాయి. అనిల్ సుంకరకే కాదు ఇది అందరికీ పాఠమే
This post was last modified on May 1, 2023 6:24 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…