Movie News

అనిరుధ్ విశ్వరూపం చూడబోతున్నాం

కేవలం 17 ఏళ్ల వయసులో కొలవరి పాటతో పెను సంచలనమే రేపాడు అనిరుధ్ రవిచందర్. 3 సినిమాలోని ఆ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో అనిరుధ్ ప్రతిభ చూసి కొందరు గాలి వాటం అనుకున్నా.. ఆ తర్వాత దీన్ని మించిన ఆల్బమ్స్‌తో తన సత్తా ఏంటో చూపించాడు అనిరుధ్.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను ఇంతవరకు చేసిన సినిమాలు.. ఇప్పుడు చేస్తున్న చిత్రాల స్కేల్ చూస్తే తన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతం అటు తమిళంలో, ఇటు తెలుగులో క్రేజీ సినిమాలతో తన స్థాయి ఏంటో చూపిస్తున్నాడు అనిరుధ్. త్వరలో అనిరుధ్ విశ్వరూపం చూడబోతున్నామని అనిరుధ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల స్థాయి చూస్తే అర్థం అవుతుంది.

తమిళంలో అనిరుధ్ అన్నీ మెగా మూవీసే చేస్తున్నాడు. కమల్ హాసన్, శంకర్‌ల కలయికలో రూపొందుతున్న ఇండియన్-2కు అతనే సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మరో లెజెండరీ హీరో రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్’కు కూడా అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది.

మరోవైపు విజయ్ కొత్త సినిమా ‘లియో’కు అనిరుధ్ పని చేస్తున్నాడు. ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా అజిత్ హీరోగా ప్రకటించిన కొత్త చిత్రం ‘విడా ముయర్చి’కి అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. రజినీకాంత్ కొత్త సినిమాకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సయ్యాడు.

ఇక తెలుగు విషయానికి వస్తే.. ఎన్టీఆర్, కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి అనిరుధ్‌ను ఆల్రెడీ సంగీత దర్శకుడిగా ప్రకటించారు. ఇంకా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సయ్యాడు. ఇవి కాక హిందీలో షారుఖ్ సినిమా ‘జవాన్’కు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాకు ఏకంగా రూ.5-6 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అనిరుధ్. త్వరలో అనిరుధ్ మేనియా చూడబోతున్నామని అతడి లైనప్ చూప్తే అర్థమవుతుంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

1 hour ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

2 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

2 hours ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

3 hours ago