తెలుగులో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే హీరోల్లో గోపీచంద్ ముందు వరుసలో ఉంటాడు. తెరపై అతను అగ్రెసివ్‌గా ఉండే పాత్రలు చేస్తూ.. విలన్ల మీద విరుచుకుపడుతుంటాడు కానీ.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. మాట, ప్రవర్తన.. అన్నీ కూడా సున్నితంగా ఉంటాయి.
తన చుట్టూ ఎలాంటి వివాదాలూ కనిపించవు. అలాంటిది ‘రామబాణం’ సినిమాకు సంబంధించి దర్శకుడు శ్రీవాస్‌తో గోపీకి గొడవ జరిగినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. వీరి కలయికలో ఇంతకుముందు ‘లక్ష్యం’; ‘లౌక్యం’ లాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. మూడోసారి ఈ జోడీ కలిసి చేస్తున్న ‘రామబాణం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే షూటింగ్ మధ్యలో ఔట్ పుట్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో గోపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
‘‘నేను, శ్రీవాస్ గొడవ పడ్డాం అన్నది వాస్తవం కాదు. నిజానికి నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. ఏదైనా నచ్చకపోతే అవతలి వ్యక్తికి చెప్పేస్తా. అతను వింటే సరే.. లేదంటే నేను పట్టించుకోకుండా వదిలేస్తా. నేను చెప్పాల్సింది మాత్రమే చెబుతా. శ్రీవాస్‌తో నాకు మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ‘రామబాణం’ సినిమా విషయానికి వస్తే.. మేకింగ్ టైంలో కొన్ని సీన్లు లెంగ్తీగా అనిపించాయి. ఇంత పెద్దగా తీయాల్సిన అవసరం లేదు అని శ్రీవాస్‌కు చెప్పా.
అతను అలా ఉన్నా పర్వాలేదని, ముందు తీసేద్దాం అని చెప్పాడు. అవసరం లేదనుకుంటే ఎడిటింగ్‌తో లెంగ్త్ తగ్గించవచ్చని.. ఒకవేళ తర్వాత అవి అవసరం అనుకున్నా తీయలేమని చెప్పాడు. తీరా చూస్తే ఎడిటింగ్‌లో ఆ సన్నివేశాలన్నీ లేచిపోయాయి. దీని విషయంలో మేమేమీ గొడవ పడలేదు. కానీ మీడియాలో మాత్రం పెద్ద గొడవ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండేవే’’ అని గోపీ వివరించాడు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…