ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా.. ఒక టాప్ స్టార్ కొత్త సినిమా ప్రకటించడానికి ముందు నెలకొనే సందడే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుల కొత్త సినిమా విషయంలో ఎంతో క్యూరియాసిటీ కనబరుస్తారు. తమిళంలో విజయ్, అజిత్ లాంటి స్టార్ల సినిమాల విషయంలో హడావుడి మరింత ఎక్కువగా ఉంటుంది.
అభిమానులు ఊహించలేని కాంబినేషన్లు సెట్ చేసే అజిత్ కుమార్‌కు ఒక దర్శకుడు నచ్చాడంటే వరుసగా రెండు మూడు సినిమాలు చేసేస్తాడు. శివతో ఏకంగా నాలుగు సినిమాలు చేసిన అజిత్.. హెచ్.వినోద్ అనే యువ దర్శకుడితో మూడు సినిమాలు లాగించాడు. చివరగా వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘తునివు’ తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత అజిత్.. నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో సినిమా చేయాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. విఘ్నేష్ స్థానంలో వేరే దర్శకుడు వచ్చాడు.
అతనే.. మగిల్ తిరుమణి. తమిళంలో మేఘమన్, తడం లాంటి థ్రిల్లర్లతో బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకుడు మగిల్. ‘తడం’ సినిమాతో తెలుగులోకి ‘రెడ్’ పేరుతో రీమేక్ అయింది కూడా. దీని ఒరిజినల్ చూస్తే మగిల్ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఐతే ఇప్పటిదాకా మిడ్ రేంజ్ హీరోలతోనే జట్టు కట్టిన మగిల్.. ఇప్పుడు ఏకంగా అజిత్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ అజిత్ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.
అజిత్, మగిల్ కలయికలో సినిమా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ రోజే అజిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాను ప్రకటించింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ‘విడా మయూర్చి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ పదానికి తమిళంలో ‘దృఢ నిశ్చయం’ అని అర్థం. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ అని క్యాప్షన్ కూడా జోడించారు. లైకా సంస్థలో సినిమా అంటే భారీగానే ఉంటుంది. అజిత్‌తో మగిల్ మార్కు థ్రిల్లర్ సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం. ఈ చిత్రం ఆటోమేటిగ్గా తెలుగులోనూ రిలీజవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…